Cinema

మరో కొత్త రెండు సినిమాలతో ముందుకొచ్చేస్తున్న కార్తికేయ

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తికేయ రీసెంట్‌గా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘ప్రేమలు’ చిత్రం కార్తికేయ సమర్పణలో తెలుగులో విడుదలైంది. ప్రముఖ బ్యానర్స్‌పై ‘ప్రేమలు’ చిత్రాన్ని కార్తికేయ తెలుగు ప్రేక్షకులు అందించారు. ఇక్కడ కూడా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. రోజు రోజుకీ ఈ సినిమా తెలుగు వెర్షన్ కలెక్షన్స్ పెరుగుతున్నాయి.

ఈ బ్లాక్ బస్టర్ విజయం అందించిన నమ్మకంతో ఎస్.ఎస్.కార్తికేయ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. బాహుబలి వంటి సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ అర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలిసి కార్తికేయ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రూపొందించనున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌ రూపకల్పనలో కార్తికేయతో నిర్మాత శోభు యార్లగడ్డ చేతులు కలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

కార్తికేయ తెలుగులో విడుదల చేసిన ప్రేమలు చిత్రానికి ఫహాద్ పాజిల్ కూడా ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే. దాంతో పాటు నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన కార్తికేయ రూపొందించనున్న రెండు చిత్రాల్లోనూ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అందులో ఒకటి స్నేహాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తోన్న ‘ఆక్సిజన్’ చిత్రం. ఈ సినిమాతో సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మరో చిత్రం థ్రిల్లింగ్ ఫాంటసీ కథాంశంతో రూపొందనున్న చిత్రం. దీనికి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంతోనూ శశాంక్ ఏలేటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ రెండు చిత్రాలకు వేటికవే భిన్నమైనవి, కంటెంట్ బేస్డ్ మూవీస్ కూడా.

వేదం, మర్యాద రామన్న, అనగనగా ఒక ధీరుడు, పంజా చిత్రాలను నిర్మించిన సంస్థ ఆర్కా మీడియా… తర్వాత నిర్మించిన బాహుబలి ఫ్రాంచైజీతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

ప్రేమలు చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసిన ఎస్.ఎస్.కార్తికేయ, ఇదే సందర్భంలో తాను చేయబోతున్న రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ వివరాలను కూడా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా నా తొలి చిత్రం ‘ప్రేమలు’ ద్వారా నాకు విజయాన్ని అందించి నాపై మీకున్న అపరిమితమైన ప్రేమను తెలియజేశారు. దీంతో మంచి చిత్రాలకు భాషాపరమైన బేదాలుండవనే నమ్మకం నాలో మరింతగా పెరిగింది. ప్రేమలు చిత్రాన్ని పంపిణీ చేయటం, థియేటర్స్‌కు ఆడియెన్స్ ఎలా వచ్చారనే విషయాలను చెక్ చేసుకోవటం, ప్రతీ టికెట్‌ అమ్ముడైనప్పుడు, హౌస్ ఫుల్ థియేటర్ చూసినప్పుడు ఇలా ప్రతీ విషయాన్ని ఎంజాయ్ చేశాను. గత ఏడాది మా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాంటి గొప్ప ఆనందాన్నే పొందాను.

రెండేళ్ల ముందు సిద్ధార్థ్ నాదెళ్లతో కలిసి స్నేహం మీద స్ఫూర్తిదాయకమైన కథ కోసం పని చేస్తున్నప్పుడు, అనుకోకుండా థ్రిల్లింగ్ ఫాంటసీ కథ ఒకటి నా దగ్గరకొచ్చింది. డెబ్యూ డైరెక్టర్ శశాంక్ ఏలేటి చెప్పిన ఈ కథ కూడా నన్నెంతో ఎగ్జయిట్ అయ్యేలా చేసింది. రెండు కథలను ఒకే స్టార్ ఒప్పుకుంటారని అనుకోలేదు. అలాంటి ఫహాద్ ఫాజిల్ గారు తొలిసారి కథ వినగానే రెండింటిలో నటించటానికి ఒప్పుకున్నారు. ఫహాద్‌గారు బహుముఖ ప్రజ్ఞకు ప్రతిరూపం, నేనెంతగానో ఆరాధించే వ్యక్తి. ఐ లవ్ యూ సో మచ్ సార్. ఇదే మీపై మాకున్న ‘ప్రేమలు’అలాగే శోభుగారికి కూడా ధన్యవాదాలు. ఆయనెంతగానో నన్ను ప్రోత్సహించటమే కాకుండా ఈ ప్రయాణంలో నాతో పాటు చేతులు కలిపారు’’ అన్నారు.

Share
Published by
Shankar

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM