Cinema

లావ‌ణ్య త్రిపాఠి సతీ లీలావతికి దర్శకుడు తాతినేని సత్య

వైవిధ్య‌మైన ప్రాత‌ల‌తోక‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ సినిమా రూపొంద‌నుంది. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)త‌దిత‌ర విభిన్న‌ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య దర్శకత్వంలో నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఆదివారం (డిసెంబ‌ర్ 15),లావ‌ణ్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది.

‘స‌తీ లీలావ‌తి’ చిత్రంతో మ‌రోసారి డిఫ‌రెంట్ రోల్‌, ఎగ్జ‌యిటింగ్ క‌థాంశంతో మెప్పించ‌టానికి లావ‌ణ్య త్రిపాఠి సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వ‌ర‌లోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.

మిక్కీ జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా, బినేంద్ర మీన‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఉద‌య్ పొట్టిపాడు మాట‌లు అందిస్తుండ‌గా.. కోసనం విఠ‌ల్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, స‌తీష్ సూర్య ఎడిట‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM