Cinema

లైగర్ చేతుల మీదుగా ‘ప‌చ్చీస్’‌ టీజ‌ర్ విడుదల

ఆద్యంతం ఉత్కంఠ‌త‌ను రేకెత్తించే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ప‌చ్చీస్’‌. ఈ చిత్రాన్ని ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శ్వేతా వ‌ర్మ హీరోయిన్‌.

‘ప‌చ్చీస్’ టైటిల్ టీజ‌ర్‌ను గురువారం సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఆవిష్క‌రించారు. ట్రైల‌ర్ త‌న‌కు బాగా న‌చ్చింద‌నీ, సినిమా చాలా ఇంట‌రెస్టింగ్‌గా ఉంటుంద‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంద‌నీ ఆయ‌న అన్నారు.

ద‌ర్శ‌కులు శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి మాట్లాడుతూ… “క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ప‌చ్చీస్‌ను రూపొందిస్తున్నాం. కొత్త‌ద‌నం కోసం ఎదురుచూసే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేవిధంగా ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. విజువ‌ల్స్‌, మ్యూజిక్‌, సౌండ్ లాంటి అన్ని విష‌యాల్లోనూ ఈ సినిమా బాగా వ‌స్తోంది. ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. నాన్‌స్టాప్ యాక్ష‌న్‌తో, గాంబ్లింగ్‌, పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుంది. ముఖ్య‌మైన విష‌యం ఏమంటే థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్ కోస‌మే ఈ సినిమా తీస్తున్నాం. మ‌రీ ముఖ్యంగా మ్యూజిక్‌, సౌండ్ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయి.” అని చెప్పారు.‌

హీరో రామ్స్ మాట్లాడుతూ… “ఎంతో క్వాలిటీతో ‘ప‌చ్చీస్’ వ‌స్తున్న తీరుకు నేను నిజంగా హ్యాపీగా ఉన్నాను. ఈ విష‌యంలో నా టీమ్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా. నా ఫ‌స్ట్ ఫిల్మ్‌కు గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తోన్న వారికి థాంక్స్. టీజ‌ర్ రిలీజ్ చేసినందుకు, త‌న స‌పోర్ట్ అందిస్తున్నందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స్పెష‌ల్ థాంక్స్.” అన్నారు.

హీరోయిన్ శ్వేతావ‌ర్మ మాట్లాడుతూ… “ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప‌చ్చీస్‌కు ప‌నిచేయ‌డాన్ని ఎంత‌గానో ఆస్వాదించాను. ఆడియెన్స్ ఈ మూవీని ఎంజాయ్ చేస్తార‌నీ, ప‌చ్చీస్ స‌క్సెస్ అవుతుంద‌నీ గ‌ట్టిగా న‌మ్ముతున్నా.” అన్నారు.

షూటింగ్ పూర్త‌యిన ‘ప‌చ్చీస్’‌కు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుదిద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

తారాగ‌ణం:
రామ్స్‌, శ్వేతా వ‌ర్మ‌, జ‌య‌చంద్ర‌, ర‌వివ‌ర్మ‌, కేశ‌వ్ దీప‌క్‌, ద‌యానంద్ రెడ్డి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, విశ్వేంద‌ర్ రెడ్డి.

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి
నిర్మాత‌లు: కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి
బ్యాన‌ర్స్‌: ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్‌
స‌హ నిర్మాత‌: పుష్ప‌క్ జైన్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: దినేష్ యాద‌వ్ బొల్లెబోయిన‌
ర‌చ‌న‌: శ్రీ‌కృష్ణ‌
సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ప‌ర్మార్‌
సంగీతం: స్మ‌‌ర‌ణ్ సాయి
ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌: రోహ‌న్ సింగ్‌
ఎడిటింగ్‌: రాణా ప్ర‌తాప్‌
సాహిత్యం: నిఖిలేష్ సుంకోజి
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM