Featured

ట్రైయిన్‌లో వాష్‌ రూమ్‌కి వెళ్లిన వ్యక్తి షాక్‌.. డస్ట్‌ బిన్‌ కింద కెమెరా!

ప్రతి నిత్యం ఎందరో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. వాటిల్లో ఉండే సదుపాయాల గురించి అందరికి తెలిసిందే. వేరే స్టేట్స్ రైల్వేలలో ఉండే సదుపాయాల గురించి కంటే మన భారతీయ రైల్వేలలో ఉండే సదుపాయాల చాలా తక్కువ. రైళ్లలో దొరికే ఫుడ్ విషయం పక్కన పెడితే, మరుగుదొడ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. దూర ప్రాంతాలకి వెళ్లేవారు తప్పక ఆ మరుగుదొడ్లని వాడుతుంటారు. కొన్ని కొన్ని రైళ్ల పరిస్థితి బాగానే ఉన్నా, కొన్ని రైళ్లలో ఇలానే ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య ఒక ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ముంబై నుంచి భగత్‌ కి కోఠికి రైల్లో ప్రయాణించాడు. మార్గ మధ్యలో తప్పనిసరి పరిస్థితిలో వాష్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడే ఉన్న డస్ట్ బిన్ కింద ఉన్న దానిని చూసి ఆశ్చర్యపోయాడు. తీరా ఏమిటా అని చూస్తే అక్కడొక పవర్ బ్యాంకు, దానికి ఉన్న ఓ చిన్న కెమెరా. వెంటనే దానిని తీసుకుని రైల్వే పోసులకి సమాచారం అందించాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, అదే రైల్లో స్వీపర్ పని చేస్తున్న షేక్ జహిద్దీన్ అనే వ్యక్తి నిర్వాకమని తెలిసి అందరు షాక్ తిన్నారు. అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అసలు ఇదంతా ఎన్ని రోజులుగా జరుగుతుంది… ఇప్పటి వరకు ఉన్న డేటా ఎక్కడైనా దాచాడా అనేదానిపై పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు.

ఇలాంటివి తరుచూ జరుగుతూనే ఉన్నాయి. హోటల్స్‌లో, షాపింగ్ మాల్స్ వంటి చోట కూడా ఇలాంటివి వింటూనే ఉన్నాం. ఇక ట్రైయిన్స్‌ లో కూడా అంటే.. మానవజాతి ఎంత నీచంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా.. మరీ ముఖ్యంగా.. ఇలాంటి సందర్భాల్లో కాస్త చుట్టు పక్కల ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. టెక్నాలజీ పెరుగుతుంది అంటే.. సంతోషించాలో.. బాధపడాలో అనే సందిగ్థ పరిస్థితిని ఇలాంటి సంఘటను కలుగుజేస్తున్నాయి.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM