Cinema

జనవరి 4న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు’, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనం సృష్టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ‘మీసాల పిల్ల’ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటగా, ‘శశిరేఖ’ పాట దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేష్ నటించిన పాట ‘సంక్రాంతి అదిరిపోద్ది’ ఒక ఫెస్టివల్ సాంగ్ లా మారింది.

‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో చిరంజీవి తెల్లటి చొక్కా, ముదురు రంగు ప్యాంటు ధరించి, ఒక మోకాలిపై కూర్చుని, చేతిలో షాట్‌గన్ పట్టుకుని, చుట్టూ యాక్షన్‌లో ఉన్న వ్యక్తుల మధ్య కనిపించడం అదిరిపోయింది.

అనిల్ రావిపూడి ఇప్పటికే ఇది హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు క్రైమ్ డ్రామా షేడ్స్ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని హింట్స్ నేపథ్యంలో ట్రైలర్‌ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, కేథరీన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి విజువల్స్‌ను అందిస్తుండగా, తమ్మిరాజుఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ రైటర్స్.

మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12, 2026న థియేటర్లలోకి గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన యూఎస్‌ఏ అడ్వాన్స్ సేల్స్ అద్భుతంగా ప్రారంభమయ్యాయి. వేగంగా100K నమోదు కావడం, ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమాపై ఉన్న మ్యాసీవ్ బజ్‌ను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM