Featured

Sreemalika: పురాణపండ ‘శ్రీమాలిక’తో మంత్రులు రేణుకా చౌదరి, నారాయణ, దుర్గేష్ శ్రీపదార్చన!

Sreemalika: గోరంత భక్తి పొంగే వారింట కొండంత కటాక్షం కురిపించే మహాస్వరూపం, మహా శక్తి, మహానుగ్రహం బెజవాడ కనకదుర్గమ్మ చరణాల చెంతకు ఒక నాలుగు వందల పేజీల అపురూపాన్ని మహాద్భుత మంత్ర పేటిక ‘శ్రీమాలిక’ గ్రంధంగా వేల వేల ప్రతులు సమర్పించడం, సుజనా చౌదరి సారధ్యంలో ఈ శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపైనే కాకుండా మరికొందరు ప్రముఖులు న్యూ ఢిల్లీ, హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడలలో సైతం సీనియర్ ఐఏఎస్ అధికారులకు, రాజకీయ యోధులకు పరమ పవిత్ర కానుకగా సమర్పించడం ప్రత్యేక విశేషంగా పేర్కొనాలి.

కార్యనిర్వహణాధికారి కుర్చీలో కూర్చుని అతి తక్కువ సమయంలో సర్వ సమర్థునిగా అన్ని వర్గాల చేత చక్కని కీర్తిని అమ్మవారి అనుగ్రహంతో సంపాదించుకున్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఇ.ఓ. శీనా నాయక్ ఈ ప్రతులను అమ్మవారి సమక్షంలో ఈ శరన్నవరాత్రుల్లో స్వీకరించి శ్రీమాలిక లోపలి ఆర్షధర్మపు కంటెంట్‌ని ప్రశంసించారు.

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత మంత్ర విద్యలతో, స్తోత్ర విద్యలతో భక్తి నిండిన హృదయాలకు ‘శ్రీమాలిక’ మహా గ్రంథ పరిమళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ల సారధ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోయి, సుసంపన్నమవ్వాలనే ఆకాంక్షిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల చిత్రాలను ముద్రించి మరీ శ్రీమాలిక బుక్‌ను అద్భుతంగా అపూర్వంగా అందించడం విశేషం. ఈ మొత్తం శ్రీ కార్యాన్ని కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య రాజీపడకుండా మంచి క్వాలిటీ‌తో సమర్పించడం పట్ల తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

న్యూఢిల్లీలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి, విజయవాడలో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖామంత్రి పి. నారాయణ, తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హైదరాబాద్‌లో తెలంగాణ రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి శైలజ రామయ్యర్ తదితరులు ఈ అద్భుతగ్రంధం రచనా సంకలన కర్త, పురాణపండ శ్రీనివాస్ సృజనాత్మక ప్రతిభా సామర్ధ్యాలపై అభినందనలు వర్షించడం ప్రత్యేకంగానే పేర్కొనాలి.

Also Read- Puranapanda Srinivas: అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘమన్న పురాణపండ

ప్రముఖ పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వకార్యాలెన్నింటికో ఈ శ్రీమాలిక గ్రంధాన్ని నిస్వార్ధ యజ్ఞసేవగా అందించడాన్ని జనసేన శ్రేణులు, తెలుగుదేశం సీనియర్ నాయకులూ అభినందిస్తున్నారు.

ఎన్నో కష్టాలెదుర్కొని కూడా పురాణపండ శ్రీనివాస్ నిరాఘాటంగా చేస్తున్న ధార్మిక సేవ చాలామంది పీఠాధిపతులు, మఠాధిపతులు సైతం చేయట్లేదని తెలుగు రాష్ట్రాలలో పలువురు స్పష్టంగా పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఎంతో భక్తితో ఎందరెందరో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఈ శ్రీమాలికను తమ అనుచరగణాలచేత పసుపు కుంకుమలతో పంచి పెట్టించినట్లు తెలుగు మహిళలు ముక్తకంఠంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- అమృతేశ్వరునిపై శ్రీనివాసుని ‘సహస్ర’ అమృతధారల్ని వర్షించిన కొర్రపాటి

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM