Cinema

Manchu Manoj: ‘రక్షక్’గా రాకింగ్ స్టార్ మంచు మనోజ్

Manchu Manoj:  రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

టైటిల్ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. మంచు మనోజ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై చాలా ఆసక్తిని కలిగించారు. పోస్టర్‌పై కనిపించే “The hidden truth is never hidden forever (దాచిన నిజం శాశ్వతంగా దాగి ఉండదు)” అనే ట్యాగ్‌లైన్ కథలోని మిస్టరీని సూచిస్తుంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా బిజీగా వున్న మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం, మిరాయ్ సినిమాల్లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ‘రక్షక్’ చిత్రంతో మళ్లీ హీరోగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామా ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేస్తారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM