Featured

Sreemalika: పురాణపండ ‘శ్రీమాలిక’ పరిమళం రమణీయమని ప్రశంసించిన వాణీదేవి

Sreemalika: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ వ్యాఖ్యానం, అపూర్వమైన పురాణేతిహాస కథా వైవిధ్యం, గ్రహపీడల్ని తేలికగా నియంత్రించి తొలగించే భక్తి స్తోత్రాలు, ప్రతీ పేజీలో ప్రజ్వలించే మంత్రశక్తులు.. ప్రతీ అక్షరమూ కాంతిమయమేనన్నారు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె, తెలంగాణ శాసనమండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి. ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత రచనా సంకలనం శ్రీమాలిక గ్రంధం పదహారవ పునర్ముద్రణను హైదరాబాద్ త్యాగరాయగాన సభలో ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీమతి వాణీదేవి మాట్లాడుతూ ఈ మహా గ్రంధంలో తిరుమల గిరుల పారవశ్యాలు, నృసింహ ఆవిర్భావ ఘట్టాల కథలు చదువుతుంటే వొళ్ళు గగుర్పొడుస్తోందని.. పురాణపండ శ్రీనివాస్ రచనా శైలీవిన్యాసంలోని రమణీయత, కమనీయత భక్తి నిండిన మనస్సుకే ఇంజెక్ట్ అవుతుందని ప్రశంసలు వర్షించారు.

Puranapanda Srinivas

సభకు అధ్యక్షత వహించిన శృంగేరి మహాసంస్థానం వారి శ్రీ జ్ఞానసరస్వతీ దేవస్థానం ధర్మాధికారి కే. జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. ఓ మహోదాత్త పవిత్ర సంకల్పంతో ఈ శ్రీమాలిక గ్రంధం కేవలం మొదట నూట అరవై పేజీలతో మొదలై.. ఇప్పుడు పదహారవ పునర్ముద్రణ నాలుగువందల పేజీల రామణీయకత్వంతో శోభిల్లడం వెనుక పురాణపండ శ్రీనివాస్ అకుంఠిత కృషి, మేధ, విరామమెరుగక పరిశ్రమించే నిస్వార్ధత, అసాధారణ ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అభినందించారు.

శ్రీమాలిక పవిత్ర గ్రంథ రచనా సంకలనకర్త, విఖ్యాత ఆధ్యాత్మిక ప్రచురణల సంస్థ జ్ఞానమహాయజ్ఞకేంద్రం ఫౌండర్ చైర్మన్ పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆపదలను దూరంచేసే ఈ మనోహరమైన మంత్రాల మాటున తిరుమల వేంకట నారాయణుని మంగళానుగ్రహం ఉందనేది నిరూపితమైందని వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో వంశీ సంస్థల చైర్మన్ వంశీరామరాజు, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, త్యాగరాయగానసభ సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి చక్రపాణి, పాలకవర్గ సభ్యురాలు గుండవరపు సీతాదేవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM