Cinema

Raviteja Khiladi: మాస్ మ‌హారాజా ర‌వితేజ ‘ఖిలాడి’ గ్లిమ్స్ అదిరింది

‘క్రాక్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, ‘రాక్ష‌సుడు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. డా. జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌ర్పణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌. మాస్‌మ‌హారాజా ర‌వితేజకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్రయూనిట్ మంగళవారం ‘ఖిలాడి’ గ్లిమ్స్‌ని విడుద‌ల చేసింది.

ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ర‌మేష్ వ‌ర్మ ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తీర్చిదిద్దుతున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, ‘లూసిఫ‌ర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్‌ వంటి టాప్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. శ్రీ‌కాంత్ విస్సా, దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ‘రాక్ష‌సుడు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో త‌మ‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అని స‌త్య‌నారాయ‌ణ కోనేరు, ర‌మేష్ వ‌ర్మ నిరూపించారు. ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రాన్ని బ‌డ్జెట్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకుండా అత్యున్న‌త సాంకేతిక ప్ర‌మాణాల‌తో రూపొందిస్తున్నారు.

ఈ గ్లిమ్స్‌లో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో చేతిలో సుత్తి పట్టుకుని కంటైన‌ర్ బాక్సుల మ‌ధ్య‌లో నుండి న‌డిచివ‌స్తున్న రవితేజ ఎంట్రీ అదిరిపోయింది. ఈ వీడియో చూస్తుంటే ర‌వితేజ విల‌న్ బ్యాచ్ ప‌ని ప‌ట్ట‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. రవితేజ అల్ట్రా-స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్న ఈ సినిమా యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు మంచి ట్రీట్ కానున్న‌ద‌ని ఈ గ్లిమ్స్ ద్వారా తెలిపారు మేక‌ర్స్‌. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లిమ్స్‌ని ఎలివేట్ చేసింద‌న‌డంతో సందేహం లేదు. సౌత్ ఇండ‌స్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు మాస్ట‌ర్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తోంది.

Share
Published by
Just Teaser

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM