Cinema

Kattalan: క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ “కటాలన్” మాస్ అవతార్‌తో సెకండ్ షాకింగ్ లుక్ రిలీజ్

Kattalan: క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కట్టాలన్’ సెకండ్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఫస్ట్ లుక్ తర్వాత, రెండవ లుక్‌ మరింతగా ఆశ్చర్యపరిచేలా రూపొందించారు. ఏనుగుల వేట నుండి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్‌ను సూచిస్తూ, ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేస్తుంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌లోనూ, తాజాగా విడుదలైన సెకండ్ లుక్‌లోనూ పవర్ ఫుల్ లుక్‌లో చూపించారు.

మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనున్న ‘కటాలన్’, మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. షరీఫ్ మహమ్మద్ నిర్మించిన పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ తర్వాత క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుండి వస్తున్న మూవీ. మాస్ అప్పీల్ , యాక్షన్ పరంగా ఈ సినిమా ‘మార్కో’ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుందని పోస్టర్లు సూచిస్తున్నాయి.

ఈ చిత్రం మొదటి టీజర్ జనవరి 16న విడుదల కానుంది. ‘కటాలన్’ ఇప్పటికే మలయాళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓవర్సీస్ డీల్స్‌లో దక్కించుకుందని, షూటింగ్ పూర్తి కాకముందే అనేక ప్రీ-రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టింది . ఫార్స్ ఫిల్మ్స్‌తో కలిసి, ‘కటాలన్’ ఒక మలయాళ చిత్రానికి ఇప్పటివరకు ఎన్నడూ లేని అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది.

యాక్షన్ సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో, ఓంగ్-బాక్ సిరీస్‌తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “పాంగ్” అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది.

ఈ చిత్రానికి సంగీతాన్ని కాంతార, మహారాజ వంటి బ్లాక్‌బస్టర్‌లతో దక్షిణ భారతదేశం అంతటా సంచలనం సృష్టించిన బి. అజనీష్ లోక్‌నాథ్ అందించారు. పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు నటుడు సునీల్ (పుష్ప, జైలర్ 2 ఫేమ్), కబీర్ దుహాన్ సింగ్ (మార్కో), రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్‌ను ఉన్నీ ఆర్. రాశారు.

కటాలన్ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

సిబ్బంది:
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జుమాన్ షెరీఫ్
సినిమాటోగ్రఫీ – రెనదివ్
సంగీతం – బి. అజనీష్ లోక్‌నాథ్
ఎడిటింగ్ – షమీర్ మహమ్మద్
స్టంట్స్ – కేచా ఖంఫక్డీ, యాక్షన్ సంతోష్
ప్రొడక్షన్ డిజైన్ – సునీల్ దాస్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – దీపిల్ దేవ్
ప్రొడక్షన్ కంట్రోలర్ – దీపక్ పరమేశ్వరన్
ఆడియోగ్రఫీ – రాజాకృష్ణన్ M.R.
సౌండ్ డిజైన్ – కిషన్, సప్త రికార్డ్స్
కాస్ట్యూమ్ డిజైన్ – ధన్య బాలకృష్ణన్
మేకప్ – రోనాక్స్ జేవియర్
సాహిత్యం – సుహైల్ కోయా
స్టిల్ ఛాయాగ్రహణం – అమల్ సి.సుధర్
కొరియోగ్రఫీ – షరీఫ్
VFX – 3 Doors
PR & మార్కెటింగ్ – వైశాఖ్ సి వడక్వీడు, జిను అనిల్ కుమార్
మలయాళ PRO – అతిరా దిల్జిత్
మలయాళం డిజిటల్ మార్కెటింగ్ – అబ్స్క్యూరా ఎంటర్‌టైన్‌మెంట్
హిందీ మార్కెటింగ్ – మ్యాక్స్ మార్కెటింగ్ లిమిటెడ్.
తెలుగు PRO – వంశీ శేఖర్
తెలుగు డిజిటల్ మార్కెటింగ్ – హ్యాష్‌ట్యాగ్ మీడియా, దిలీప్
టైటిల్ డిజైన్ – Ident Labs
పబ్లిసిటీ డిజైన్ – ఎల్లో టూత్

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM