Cinema

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ సక్సెస్ పార్టీ

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మెగా ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రికార్డులను బద్దలు కొట్టి, సంచలనాత్మకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ద్భుతమైన జోరును కొనసాగిస్తూ, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో మెగాస్టార్ ఇంట్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని, చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో ఒక గ్రాండ్ పార్టీని ఇచ్చి, ఆ సాయంత్రాన్ని సంక్రాంతి వేడుకల కొనసాగింపుగా మార్చారు. తారల సందడితో కూడిన వేడుకకు రామ్ చరణ్, వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలతో పాటు పలువురు హాజరయ్యారు.

ఈ వేడుకలు ఉత్సాహభరితమైన కేక్ కటింగ్ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి, అనంతరం చిత్ర బృందం అద్భుతమైన విందులో పాల్గొంది. నవ్వులు, కృతజ్ఞతలు, ఆత్మీయ సంభాషణలతో వేడుక కన్నుల పండగలా సాగింది. సినిమా ఘన విజయానికి కారణమైన ప్రతి సభ్యుడికి చిరంజీవి స్వయంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వేడుకను విజయోత్సవంగా మాత్రమే కాకుండా ముందస్తు భోగి, సంక్రాంతి సంబరాలుగా ఆనందంగా జరుపుకున్నారు. టీంలో కనిపించిన ఐక్యత, సినిమాకు లభిస్తున్న డ్రీమ్ రన్ కలిసి ఈ వేడుక మెగా మెమరబుల్ మూమెంట్ గా నిలిచింది.

Recent Posts

“ఓ మాట అనుకుందామా” డబ్బింగ్ పూర్తి

శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్ లో సుహాసిని, వినోద్ కుమార్ ప్రధాన జంటగా,శ్రీనివాస్ అనంతనేని , మౌనిక హీరోహీరోయిన్లుగా బీమ్…

November 8, 2026 at 9:56 AM

GOYAZ 30వ స్టోర్ ను ప్రారంభించిన మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ తన 30వ స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో వైభవంగా…

November 8, 2026 at 9:48 AM

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM