Cinema

మెగాస్టార్.. నువ్వు సామాన్యుడివి కాదు బాస్

Megastar Chiranjeevi: ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని ప్రతి చిన్న విషయాన్ని తమ ఫోన్లలో బంధించేస్తున్నారు. అది ఎటువంటి అకేషన్ అయినా సరే, అంటే పుట్టిన రోజు వేడుకైనా, పెళ్లి రోజు వేడుకైనా, పిల్లల నవ్వులు, ఇలా ఎన్నో విషయాలని తమ స్మార్ట్ ఫోన్లలో బంధించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి పంచుతున్నారు. ఇటువంటి వాటిల్లో మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ముందు వరుసలో ఉంటున్నారు. అందులోను మెగా ఫ్యామిలీ గురించి ముందుగా చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో ముందు ఉంటారు. ప్రకృతి అందాల్ని తన ఫోన్లో బంధించి తన అభిమానులతో వాటిని పంచుకుంటూ ఉంటారు. అటువంటిదే ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో సోమవారం పోస్ట్ చేశారు.

ఇంత పెద్ద సిటీలో సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటివి చూడడానికి ఒక యజ్ఞమే చేయాలి. కానీ చిరంజీవి మాత్రం అప్పుడే ఉదయిస్తున్న సూర్యుణ్ణి కెమెరాలో బంధించారు. అది కూడా స్విమ్మింగ్ ఫూల్ లో ఉదయిస్తున్న సూర్యుణ్ణి వీడియో రూపంలో తన ప్రేక్షకులకి అందించారు. ‘‘ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు గడిచినా.. ఖగోళ అందాలైన సూర్యోదయ, సూర్యాస్తమయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఆ క్షణాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. మా ఇంటి ఆవరణలో ఆవిష్కృతమైన అటువంటి ఓ అందమైన ఉదయాన్ని మీతో పంచుకుంటున్నాను’’ అని తెలుపుతూ.. ఆయన క్యాప్చర్ చేసిన వీడియోని షేర్ చేశారు.

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ చేయనున్నారు. అనంతరం మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో చిత్రాలు సైన్ చేసి ఉన్నారు. త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది. ఇక మెగాస్టార్ షేర్ చేసిన వీడియోని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నువ్వు సామాన్యుడివి కాదు బాస్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM