Politics

5 రూపాయలకే భోజనం.. సీఎం కొత్త స్కీం!

CM launches new scheme: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనిక వేడెక్కుతోంది. అధికార విపక్షాలు అన్నీ పోటాపోటీగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కొత్త పథకాన్ని లాంచ్ చేశారు. ‘మా కిచెన్లు’ పేరుతో ప్రకటించిన ఈ స్కీం ప్రకారం, పేదలకు కేవలం రూ.5కే ఆహారం అందిస్తారు. ఇలా అందించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని, అయినా సరే ప్రతి ప్లేటు మీదా రూ.15ల సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుందని దీదీ స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థలుప్రతి రోజూ మధ్యాహ్నం 1 నుంచి 3గంటల మధ్య వంట పనులు చూస్తాయట. అన్నం, ఓ వెజిటెబుల్ కూర, ఎగ్ కర్రీ అందిస్తారట.

ఈ ‘మా కిచెన్లు’ను మమత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ”బెంగాల్‌లో సిటీలు, టౌన్‌లలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ‘మా కిచెన్లు’ ప్రారంభిస్తున్నాం. త్వరలోనే వీటి సంఖ్యను మరింత పెంచుతాం. ఈ పథకం లబ్ధి దారులు కేవలం 5 రూపాయలతో భోజనం చేయవచ్చు. ఈ మీల్స్ ప్రతి ప్లేటుపై 15 రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. మా కిచెన్ సెంటర్లతో చాలా మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి” అని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అలాగే సాల్ట్ లేక్ వద్ద ఐటీ పార్క్‌ సహా పలు ప్రాజెక్టులను కూడా ముఖ్య మంత్రి మమత ప్రారంభించారు.

రాష్ట్రంలో కేన్సర్ పేషంట్ల గుర్తింపు, చికిత్స, రిజిస్ట్రేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌ కూడా మమత చేతుల మీదుగా ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉన్న కాంగ్రెస్ కూడా పశ్చిమ బెంగాల్‌లో గట్టి పోటీ ఇచ్చి తన పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM