Cinema

‘డియర్ మేఘ’ ఫస్ట్ లుక్‌లో కన్నీళ్లు

మేఘ ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ దాస్యన్ నిర్మాత. యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా ‘డియర్ మేఘ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఎ సుశాంత్ రెడ్డి.

‘డియర్ మేఘ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం, ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 9.01 నిమిషాలకు రిలీజ్ చేశారు. భల్లాలదేవ రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా తన సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. హీరోలు రానా, విజయ్ సేతుపతి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. మేఘ ఆకాష్ ఉద్వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక కంటిలో నుంచి కన్నీరు రావడం కనిపిస్తోంది. సినిమాలో మేఘ ఆకాష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు, కథను నడిపే డ్రైవింగ్ ఫోర్స్ గా ఆమె ఫర్మార్మెన్స్ ఉంటుందని అనుకోవచ్చు. ఆమె కన్నీటికి కారణం ఎవరు, ఈ ఉద్వేగ పరిస్థితి ఎందుకొచ్చింది అనేది ‘డియర్ మేఘ’ సినిమాలో తెలియనుంది.

ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్: పీఎస్ వర్మ, పీఆర్వో: జీఎస్కే మీడియా, నిర్మాత: అర్జున్ దాస్యన్, రచన, దర్శకత్వం: సుశాంత్ రెడ్డి.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM