Cinema

అన్న సినిమాకి క్లాప్.. తమ్ముడి సినిమాకి ట్రైలర్ లాంఛ్

రెండు రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ‘ఉప్పెన’ సినిమా వార్తే. ఎందుకంటే మెగా హీరో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ను నందమూరి హీరో లాంఛ్ చేయబోతున్నారు. మెగా, నందమూరి కలయిక అంటే అది ఎప్పుడూ హాట్ న్యూసే. అందుకే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్‌ ఆర్ఆర్ఆర్ చిత్రానికి అంత క్రేజ్ ఏర్పడింది.

ఇప్పుడు మళ్లీ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్ర ట్రైలర్‌ను నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేస్తున్నాడని చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించడంతో ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు. వాస్తవానికి మెగా హీరోకి ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకు ముందు కూడా ఓ మెగా హీరో చిత్రానికి యంగ్ టైగర్ సపోర్ట్ చేశారు.

nandamuri hero ntr support to mega hero movie

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’ చిత్ర ఓపెనింగ్ ఫంక్షన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై క్లాప్ కొట్టారు. ఇప్పుడు సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’కు ట్రైలర్ లాంఛ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఈ చిత్ర ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

nandamuri hero ntr support to mega hero movie

ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రెండు చిత్రాలకు మెగా హీరోలు కూడా అటెండ్ అయ్యారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘బాద్‌షా’ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్ కొట్టిన విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు.

nandamuri hero ntr support to mega hero movie

మరో నందమూరి హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ రూపొందించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్ర ఓపెనింగ్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇలా మెగా, నందమూరి హీరోలు సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM