Cinema

‘ఇన్స్ పెక్టర్ రిషి’.. ట్రైలర్ సోషల్ మీడియాలో

నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “ఇన్స్ పెక్టర్ రిషి”. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమోజాన్ తమిళ్ ఒరిజినల్ గా “ఇన్స్ పెక్టర్ రిషి” ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. క్వీన్  కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర “సత్యాభామ” అనే సినిమాలో పెయిర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్ లో  “ఇన్స్ పెక్టర్ రిషి”  వెబ్ సిరీస్ ట్రైలర్ ను చూసి ఇంప్రెస్ అయిన కాజల్ అగర్వాల్  ట్రైలర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న కాజల్ అగర్వాల్… నవీన్ చంద్రతో పాటు వెబ్ సిరీస్ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.

తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. జంతువుల కళేబరాలకు పట్టినట్లే మనుషుల శవాలకు పురుగుల గూడు అల్లుకుని ఉంటుంది. అడవిలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని ఊరి జనం చెబుతుంటారు. సీబీ సీఐడీకి కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీకి చేరుతుంది. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి వస్తాడు కొత్త ఇన్స్ పెక్టర్ రిషి. ఊరి జనం మాటలు నమ్మని రిషి సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో రిషి అతని పోలీస్ టీమ్ షాక్ అయ్యే విషయాలు తెలుస్తుంటాయి. తీన్ కాడు ప్రాంత వరుస హత్యలకు  దెయ్యమే కారణమైతే అందుకు పరిష్కారాన్ని ఇన్స్ పెక్టర్ రిషి ఎలా కనుక్కున్నాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM