Cinema

అమోజాన్ ప్రైమ్ లో.. ‘ఇన్స్ పెక్టర్ రిషి’

హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్… ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్  సిరీస్ ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న నవీన్ చంద్ర..ఇటీవల జిగర్తాండ డబుల్ ఎక్స్ ఎల్ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. దీంతో నేరుగా ఆయన లీడ్ రోల్ లో కోలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో వస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇన్స్ పెక్టర్ రిషి. అమోజాన్ తమిళ్ ఒరిజినల్స్ గా ఈ సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది.

హారర్ క్రైమ్ కథతో ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. ఎలాంటి క్లూ లేకుండా జరుగుతున్న హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నవీన్ చంద్ర ఈ వెబ్ సిరీస్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అంతు చిక్కని ఈ హత్యల వెనుక ఎవరున్నారు అనేది సస్పెన్స్, హారర్ అంశాలతో ఆసక్తికరంగా ఇన్స్ పెక్టర్ రిషిలో తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకాంత్ దయాల్, కుమార్ వేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో నవీన్ చంద్ర ఏలెవన్, సత్యభామ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM