Cinema

విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” నుండి కొత్త సాంగ్ విడుదల

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ ఫిల్మ్ “ఫ్యామిలీ స్టార్”. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ చేశారు.

“ఫ్యామిలీ స్టార్” సెకండ్ సింగిల్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ లిరికల్ సాంగ్ ను రేపు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాట వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ పై చిత్రీకరించిన బ్యూటిఫుల్ డ్యూయెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్ కు ఆడియెన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.  ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ఫ్యామిలీ స్టార్” సినిమా థియేటర్స్ లో ఎంజాయ్ చేసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM