Cinema

ఆర్పీ పట్నాయక్ భగవద్గీతను లాంచ్ చేసిన విశ్వక్ సేన్

‘నేటి తరంతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం చాలా అద్భుతంగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. శాశ్వతంగా నిలబడిపోతుంది’ అన్నారు హీరో విశ్వక్ సేన్. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనం అధ్యాయం లాంచ్ చేశారు విశ్వక్ సేన్.

లాంచింగ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..  ఈ వేడుకలో భాగం కావడం గౌరవంగా వుంది. ఇలాంటి వేదికలో పాల్గోవాలంటే రాసి పెట్టి వుండాలి.  భగవద్గీత విశ్వరూప దర్శనం అధ్యాయం లాంచ్ చేయడం నా అదృష్టం.  కేవలం పాడ్ కాస్ట్ లా వినొచ్చేమో అనుకున్నాను, కానీ విజువల్ కూడా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంను చాలా చక్కగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. ఇది శాశ్వతంగా నిలబడిపోతుంది’ అన్నారు.

సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..ఈ కార్యాన్ని భగవంతుడే నా చేత చేయించాడు. నేను కేవలం నిమిత్తమాత్రుడినే. స్వామి ముకుందనంద రాసిన భగవద్గీత అందరికీ సులువుగా అర్ధమైయ్యేలా వుంటుంది. వారి అనుమతితోనే రికార్డ్ చేశాను. ఈ ప్రయాణంలో ఎంతగానో తోడ్పడిన దివాకర్ గారికి ధన్యవాదాలు. జానకీరామ్ గారు అద్భుతమైన విజువల్స్ చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. ఈ వేడుకు పెట్టడానికి కారణం కూడా జానకీరామ్. మొత్తం మన పురాణాలన్నిటిని తన బొమ్మలతో ప్రపంచానికి చెప్పే మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నారాయన. ఆయనకు మనవంతుగా సపోర్ట్ చేయాలని ఈ వేడుక ద్వారా కోరుతున్నాను. నా వంతుగా లక్ష రూపాయిలు ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం మౌళి చాలా కష్టపడ్డాడు. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. భగవద్గీత మన బ్రతుకు మొదలుపెట్టినపుడు వినాల్సినది. జీవితాన్ని మీరు ఎలా కావాలని కోరుకుంటున్నారో అలా తీసుకెళుతుంది. యూత్ ని ద్రుష్టిలో పెట్టుకొని చేసిన భగవద్గీత ఇది. అందుకే ఈ వేడుకకు ఒక యూత్ హీరో అతిధిగా వుండాలని విశ్వక్ ని పిలిచాం. ఆయన వచ్చి వేడుకలో పాల్గోవడం చాలా అనందంగా వుంది. సంపూర్ణ భగవద్గీతను తాత్పర్యంతో రికార్డ్ చేశాం. దేవుడు కల్పించిన ఈ అవకాశంను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ… భగవద్గీత ఆర్పీ పట్నాయక్ గారు తాత్పర్యంతో రికార్డ్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఇది చాలా బావుంది. చిరకాలం నిలిచిపోయే ప్రాజెక్ట్” అన్నారు. జెకె భారవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సురేష్ పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM