Cinema

‘నిన్నిలా నిన్నిలా’ ట్రైల‌ర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

నిత్యామీనన్ సినిమాల్లో కనిపించి చాలా కాలమే అవుతుంది. అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయ్యింది. ట్రైలర్‌ను ఫిబ్ర‌వ‌రి 5న విడుద‌ల చేస్తున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ‘‘నిన్నిలా నిన్నిలా ఓ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి కామెడీ, హ‌త్తుకునేలా మంచి ఎమోష‌న్స్‌, ల‌వ్ అన్ని అంశాలుంటాయి. సినిమాలో అశోక్ సెల్వ‌న్‌, రీతూవ‌ర్మ‌, నిత్యామీన‌న్ మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 5 ఉద‌యం 11 గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు:
స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు.బి
సినిమాటోగ్ర‌ఫీ: దివాక‌ర్ మ‌ణి
సంగీతం: రాజేశ్ మురుగేశ‌న్‌
పాట‌లు: శ్రీమ‌ణి
డైలాగ్స్‌: నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటి
ఆర్ట్‌: శ్రీ నాగేంద్ర తంగాల‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
డైలాగ్స్‌: నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి
నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM