Technology

వాట్సాప్ వద్దనుకునే వారు.. ఇది తప్పని సరిగా చేయాలి

ఇటీవలే ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చింది. దీనిపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది. ఈ పాలసీని చూసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్ వాడాలని ఓ ట్వీట్ చేశాడు. దీంతో చాలా మంది వాట్సాప్ యూజర్లు సిగ్నల్ బాట పట్టారు. తమ వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేసేస్తున్నారు. దీనిపై వాట్సాప్ వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అంత వివరణ ఎందుకు? ఈ నిబంధనలతో సాధారణ యూజర్ల డేటా సేకరించబోమని చెప్పినప్పుడు అసలు ఈ పాలసీ ఎందుకు తీసుకురావడం? అని వినియోగ దారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడి అయ్యింది. నూటికి 50 శాతం మంది వాట్సాప్ యూజర్లు కొత్త పాలసీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సదరు సర్వే తెలిపింది.

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై చాలా మంది యూజర్లు చిర్రెత్తి పోయి ఉన్నారు. తమ డేటా అంతా తీసుకెళ్లి వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు ఇవ్వాల్సి ఉంటుందని ఈ పాలసీలో వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ పాలసీపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేవలం బిజినెస్ ఖాతాల వివరాలు మాత్రమే ఫేస్‌బుక్‌ తో పంచుకుంటామని, సాధారణ యూజర్ల డేటా సురక్షితమేనని వివరణ ఇచ్చింది.

అయినా కూడా చాలా మంది యూజర్లు సంతృప్తి చెందలేదు. వాట్సాప్ వదిలి సిగ్నల్‌, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్స్ డౌన్‌ లోడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఈ సమయంలో వాట్సాప్ అకౌంట్‌ను, మన చాట్ హిస్టరీని డిలీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా గనుక చేయాలనుకుంటే ముందుగా సర్వర్లలోని మెసేజ్‌లన్నీ డిలీట్ చేయడం ఉత్తమం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బ్యాకప్ మెసేజ్‌లను డిలీట్ చేసే విధానం:
వాట్సాప్ బ్యాకప్ మెసేజ్‌లను కూడా మనమే డిలీట్ చేయవచ్చు. మన చాట్ హిస్టరీకి సంబంధించిన బ్యాకప్ ఫైల్స్ అన్నీ కూడా /sdcard/WhatsApp/Databases/folder అనే ఫోల్డర్‌ లో సేవ్ అవుతాయని వాట్సాప్ చెప్తోంది. ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని ముందుగా డిలీట్ చేసేసి ఆ తర్వాత వాట్సాప్ ఖాతాను డిలీట్ చేసుకుంటే మన డేటా వాట్సాప్ దగ్గర ఉండదట.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM