Cinema

నవీన్ యెర్నేని చేతుల మీదుగా ‘దర్జా’ మూడో పాట విడుదల

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని యాక్షన్ కింగ్ అర్జున్, టీజర్‌ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, మొదటి పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, రెండో పాటని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవలే ఆవిష్కరించారు. అవి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్నాయి. తాజాగా చిత్రంలోని మూడో పాటని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని చేతుల మీదుగా చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది.

పాట విడుదల అనంతరం నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ‘‘ ‘దర్జా’ చిత్రంలోని మూడో పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. ఈ పాట చూస్తుంటే సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యి, యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, చిత్ర సమర్పకులు కామినేని శ్రీనివాస్, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, రైటర్ భవానీ ప్రసాద్, హీరోయిన్ అక్సాఖాన్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్రంలోని మూడో సింగిల్‌ని విడుదల చేసి, ఆశీస్సులు అందించిన అపజయ మెరుగని నిర్మాణ సంస్థగా.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని గారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇటీవల మోషన్ పోస్టర్‌ని యాక్షన్ కింగ్ అర్జున్ గారు, టీజర్‌ని నిర్మాత సురేష్ బాబుగారు, ఫస్ట్ సింగిల్‌ని దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావుగారు, రెండో సింగిల్‌ని అల్లు అరవింద్‌గారు విడుదల చేశారు. వారిచ్చిన సపోర్ట్‌కి ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. రాప్‌రాక్ షకీల్‌గారు అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. ఇప్పటి వరకు మూడు పాటలు విడుదలయ్యాయి. ఇంకా రెండు పాటలు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే విడుదల చేస్తాం. అలాగే చిత్రాన్ని కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..’’ అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ అక్సాఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ రాప్‌రాక్ షకీల్ వంటి వారు మాట్లాడుతూ.. తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి…

కెమెరా: దర్శన్,
సంగీతం: రాప్ రాక్ షకీల్,
ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,
కథ: నజీర్,
మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ,
స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,
పీఆర్ఓ: బి. వీరబాబు,
కో & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి,
నిర్మాత: శివశంకర్ పైడిపాటి,
స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్

 

Share
Published by
admin

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM