Upasana Konidela Showed Her Golden Heart Once Again
అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన సేవా కార్యక్రమాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాటి వారికి వీలైనంత చేయూత అందించాలనే స్పూర్తిని కలిగిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆమె, మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలు అందేలా కృషి చేశారు. పర్యావరణం, వైల్డ్ లైఫ్ వంటి విషయాల్లోనూ ఉపాసన ఛారిటీలు చేస్తుంటారు.
ఆమె దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. అక్కడ ఉంటున్న వృద్ధులకు మందులు, ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ లో భాగమైన బిలియన్ హార్ట్స్ బీటింగ్ కార్యక్రమం ద్వారా ఆమె ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 150 వృద్ధాశ్రమాలకు చేయూత అందిస్తున్నారు. తాజాగా వృద్ధాశ్రమంలో ఆమె సీనియర్ సిటిజన్స్ తో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వాళ్లతో ముచ్చటిస్తూ
ఆనందాన్ని పంచారు. ఉపాసన తమ దగ్గరకు వచ్చి మాట్లాడటంతో ఆ వృద్ధులంతా
సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న సేవా
కార్యక్రమాలకు అభిమానులతో సహా నెటిజన్స్ హ్యాట్సాఫ్ అంటున్నారు.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…