Cinema

అక్టోబర్‌ 4న విడుదల కాబోతున్న ‘రోటి కపడా రొమాన్స్‌’

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. అక్టోబర్‌ 4న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. నేటి యువతరంకు నచ్చే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రంలోని ప్రతి పాత్ర అందరికి ప్రతి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా వుంటుంది. రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఇటీవల విడుదలైన పాటలకు, ట్రయిలర్‌కు మంచి స్పందన వచ్చింది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఎదో ఒక కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పాలనే వుద్దేశంతో ఇలాంటి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను తీశాం. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుంది. సినిమా విజయం గురించి ఎలాంటి డౌట్‌ లేదు. తప్పకుండా హిట్‌ కొడుతున్నాం. అయితే ఏది ఏ రేంజ్‌ అనేది ఆడియన్స్‌ చేతిలో వుంది. ఇదొక ఎమోషన్‌ల్‌ రైడ్‌. లవ్‌, ఎమోషన్‌ వుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ చిత్రంలో వుంటాయి అన్నారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM