Cinema

Sevenhills Satish:మూడో సినిమా..త్వరలో ఫస్ట్‌ లుక్‌ !

గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి కథానాయికలుగా సెవెన్‌హిల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 3గా ఓ చిత్రం రూపొందుతుంది. పి.నవీన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికి మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌ గతంలో ‘బట్టల రామస్వామి బయోపిక్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి ఆర్‌.పి.పట్నాయక్‌తో ఓ చిత్రం చేశారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న మూడో చిత్రమిది. త్వరలో ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక స్టూడెంట్‌ నుంచి కార్పొరేట్‌ స్థాయికి ఎదిగిన మఽధ్య తరగతి కుర్రాడి కథ ఇది. యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం అలరిస్తుంది. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తాం.
హీరో గౌతం కృష్ణ ‘ఆకాశవీధుల్లో’ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. తదుపరి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఆయనకు మంచి క్రేజ్‌ ఉంది. ఈ చిత్రంలో స్టూడెంట్‌ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు’’ అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ‘‘విజయవంతంగా మూడు షెడ్యూళ్లు పూర్తి చేశాం. త్వరలో టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.

నటీనటులు:
పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, ఆనంద్‌ చక్రపాణి, భద్రం, పింగ్ పాంగ్ సూర్య తదితరులు.
ప్రొడ్యూసర్‌ : సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌
దర్శకత్వం : పి నవీన్‌ కుమార్‌
కెమెరా: : త్రీలోక్‌ సిద్దూ
మ్యూజిక్‌ : జుడా శాండీ
ఎడిటర్‌ : ప్రవీణ్‌ పూడి
పీఆర్వో : మధు విఆర్‌

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM