శ్రీ కళాసుధ తెలుగు సంఘం ఉగాది పురస్కారాల ప్రకటన Sri Kalasudha Telugu Association Ugadi Puraskar Awards Announcement
కమిటీ మెంబర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ లో నేను కమిటీ మెంబర్ గా పదేళ్లుగా కొనసాగుతున్నాను. ప్రతి ఏడాది ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇలా పాతికేళ్లుగా ఈ ఉగాది పురస్కారాలు ఇస్తున్న శ్రీనివాస్ గారు, ఇతర కమిటీ మెంబర్స్ కు అభినందనలు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో ఈ పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ వేదిక మీద అవార్డ్ అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తుంటారు. శ్రీనివాస్ గారు ఏడాది అంతా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు సినిమాలను అక్కడ ఉన్న తెలుగు వారికీ చూపిస్తూ వాటిలో బాగున్న వాటిని అవార్డ్స్ కోసం సెలెక్ట్ చేస్తుంటారు. ఈ సారి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చిన ప్రతి కుటుంబానికి సిల్వర్ కాయిన్ రిటన్ గిఫ్టుగా ఇస్తున్నారు. ప్రసన్నకుమార్ గారు ఈ కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరంతా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నా అన్నారు.
కమిటీ మెంబర్ సౌజన్య మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ చెన్నై సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మండలి బుద్ధ ప్రసాద్ గారు, గానకోకిల సుశీల గారు, ఎస్ బీఐ చెన్నై సర్కిల్ జీఎం ఎంవీఆర్ మురళీకృష్ణ గారు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరవుతారు అన్నారు.
కమిటీ మెంబర్ హేమంత్ మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు ఇరవై ఐదేళ్లుగా ఉగాది పురస్కారాలు అందించడం గొప్ప విషయం. శ్రీనివాస్ గారి పట్టుదల వల్లే ఇంతమంచి కార్యక్రమం కొనసాగుతోంది. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రసన్నకుమార్ గారికి, పర్వతనేని రాంబాబు, కేశవ గార్లకు థ్యాంక్స్. ఇటీవల చెన్నైలో తెలుగు వారి కార్యక్రమాలు తగ్గిపోయాయి. కళాసుధ వారు మాత్రం క్రమం తప్పకుండా ఉగాది పురస్కారాలు అందిస్తూ వస్తున్నారు. మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలోనే మన తెలుగు వాళ్లంతా కలిసి ఉండేవాళ్ళం. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయింది. అయినా మనకు సాంస్కృతిక రాజధాని మద్రాస్ అనే అనుకోవాలి. కలకత్తాలో సినిమా పుట్టినా అక్కడి నుంచి ముంబై, షోలాపూర్ నుంచి మద్రాసు చేరింది. మద్రాసులో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, ఒరియా సినిమాలు కూడా రూపొందేవి. అలాంటి మద్రాసు నగరంలోని మ్యూజిక్ అకాడెమీలో పాతికేళ్లుగా కళాసుధ అవార్డ్స్ నిర్వహించడం గొప్ప విషయం. ఈ సంస్థ మన సినిమాలకు ఉగాది పురస్కారాలు ఇస్తూ ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది. ఉత్తమ నిర్మతా మైత్రీ మూవీ మేకర్స్, ఉత్తమ సంచలనాత్మక సినిమా భగవంత్ కేసరి, ఉత్తమ జ్యూరీ అవార్డ్ రుద్రంగి, ఉత్తమ నటుడు ధనుష్ (సార్ సినిమాకు), భగవంత్ కేసరికి ఉత్తమ నటిగా శ్రీలీల, భగవంత్ కేసరికి ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడికి ఉగాది పురస్కారాలు ఇవ్వబోతున్నారు. పాతికేళ్లుగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కళాసుధ వారికి అభినందనలు. వందేళ్లు ఇలాగే ఉగాది పురస్కారాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…