Cinema

‘శివమ్ మీడియా’ నిర్మాణ సంస్థ నుండి టీజర్ మరియు సాంగ్ లాంచ్

ప్రసాద్ లాబ్స్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్ లో..

డైరక్టర్ వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ… తనకి తెలుగు అంటే చాలా ఇష్టం. ఇలాంటి ఒక హెర్ట్ఫుల్ ఫిలిం, చేసినందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. సత్య సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నా మొదటి సినిమా, మొదటి హీరో, మొదటి హీరోయిన్, మొదటి ప్రొడ్యూసర్.. నా అనుభవం నుండి తీసిన కథ ఇది అని చెప్పారు..

తెలుగులో సత్య సినిమాకి మాటలు అందిచిన కే.ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ… సత్య ఒక సినిమాలాగా ఉండదు ప్రతీది కూడా చాలా లైవ్ గా ఉంటుంది.. ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఒకరు ఇద్దరు తప్ప అందరూ ఈ సినిమాలో కొత్తవారే, మొదటి సారి డైరక్టర్ అయినప్పటికీ వాలి మోహన్ దాస్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఈ సినీమా చుస్తున్నత సేపు ఏదో సినిమా చూసాం అని అనిపించదు,  శివ జర్నీ మీరు అందరూ చూస్తారు.. పైగ స్టూడెంట్స్  అందరూ ఆలోచిస్తారు. ప్రొడ్యూసర్ శివ మల్లాల గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు రుణ పడి ఉంటాను..

నిర్మాత కే బాబు రెడ్డి మాట్లాడుతూ… శివ నిర్మాతగా మొదటి సినిమానే సత్య లాంటి పేరుతో మొదలు పెట్టారు, పెద్ద పెద్ద విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు,

నిర్మాత సతీష్ మాట్లాడుతూ… తెలుగువాడిని అయిన నేను  చెన్నైలో స్థిరపడ్డాను.. శివకి సినీమా చూపించాను.. వెంటనే  ‘అన్న ఈ సినీమా నేను తెలుగులో రిలీజ్ చేస్తాను’ అని చెప్పారు, నిజానికి ఇలా నాతో చాలా మంది అన్నారు శివ కూడా అలానే అనుకున్నాను కాని సినిమా రిలీజ్ అప్పుడు వచ్చి స్టేజి మీద ఈ సినిమాని తెలుగులో మేము రిలీజ్ చేస్తున్నాం అన్నారు, అప్పుడు శివ సీరియస్ గానే అన్నాడని అర్ధమైంది.. ఆ తరవాత ఇదిగోండి ఈరోజు ఇలా ఉన్నాం.. హమరేష్ “విక్రమ్: హరోగా చేసిన “నాన్న” మూవీ లవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా, లోకేష్ కనగరాజ్ నగరంలో, ప్రియదర్శి గారు దర్శకత్వంలో సినిమాలు చేశాడు. అప్పుడు హమరేష్ లో ఉన్న ప్యాషన్  నాకు అర్ధం కాలేదు, పోను పోను తను పెట్టె ఎఫర్ట్ అర్ధమై, గోపురం ప్రొడక్షన్స్ లో రంగోలి పేరుతో ఈ సినిమాని స్టార్ట్ చేశాం, పెద్ద సక్సెస్ అయ్యింది.. అందుకే అందరం సపోర్ట్ చేస్తున్నాం.. తెలుగు ఇండస్ట్రీ చాలా మందిని ఆదరించింది, అలాగే అమారేష్ నీ కూడా ఆదరిస్తుంది అనుకుంటున్నాను..

ప్రార్థన సందీప్ మాట్లాడుతూ… రంగోలి తమిళ్ లో చాలా పెద్ద హాట్ అయ్యింది అండి.. ఇప్పుడు తెలుగు లో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూన్నాను అని  చెప్పారు..

హీరో అమరేష్ మాట్లాడుతూ… రంగోలి అనే తమిళ్ సినిమాని తెలుగులో సత్యగా మీ ముందుకు తీసుకొని వచ్చాము.. చెన్నైలో రిలీజ్ అయ్యే ప్రతి తెలుగు సినిమా థియేటర్ లో చూసే వాడిని.. ఈ తెలుగు స్టేజ్ కు ఉన్న పవర్ నాకు తెలుసు.. అమ్మ నాన్న, బాబు రెడ్డి గారి సపోర్ట్ లేకుండా నేను ఇదంతా చెయ్యలేను.. చాలా మంది ఈ సినిమాని తమిళ్ లో చూసి నాకు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. సినిమా చాలా బాగుంది అని..  నాన్న శ్రీశైలం, అమ్మ చెన్నై కావడంతో నాకు తెలుగు తమిళ్ రెండు ఇండస్ట్రీస్ రెండు కళ్ళతో సమానం..

TFJA ప్రెసిడెంట్ టీవీ9 లక్ష్మి నారాయణ మాట్లాడుతూ: శివ ఒక జర్నలిస్ట్ గా మీడియాలో ఉంటూ చాలా కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చాడు.. ఈ తొలి ప్రయత్నం పెద్ద విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాము.

సినీ జోష్ రాంబాబు మాట్లాడుతూ… శివ గారి సతీమణి సుజాత గారి వల్లే నాకు ఈరోజు ఈ గుర్తింపులన్ని  వచ్చాయి.. శివ గురించి నాకు బాగా తెలుసు, ఈ సినీమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము..

ప్రొడ్యూసర్ శివ మల్లాల సతీమణి సుజాత మాట్లాడుతూ… శివ గారికి మంచి సక్సెస్ రావాలని, సత్య టీమ్ కి అల్ ది బెస్ట్  చెప్పారు..

యాక్టర్ కార్తిక్ రత్నం మాట్లాడుతూ… రంగోలి సినిమా  అదిరిపోతుంది.. తెలుగులో కచ్చితంగా అందరికీ బాగా నచ్చుతుంది, శివ మల్లాల గారు ఈ సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ డైరక్టర్ వాలి మోహన్ దాస్ నాతో కూడా ఒక సినిమా చూశారు.. అది కుడా త్వరలో రిలీజ్ అవుతుంది..

బి ఎ రాజు గారు అబ్బాయి శివ మాట్లాడుతూ… ఒక మంచి కంపెని ఉంటే, లేదా ఒక చెడ్డ కంపెనీ ఉంటే ఒక మనిషి ఎలా మారుతాడు అనెది ఈ సినిమా అందరికి చూపిస్తుంది.. ..

శివమ్ మీడియా అధినేత శివ మల్లాల మాట్లాడుతూ… ఈసినిమా కొసం అన్ని అవే కలిసొచ్చాయి.. ఈరోజు మన ఈవెంట్ జరగాలిసిన టైం లో ఇక్కడ ఫ్యామిలీ స్టార్ స్క్రీనింగ్ జరిగింది.. దిల్ రాజ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అయన కష్టపడి ఎదిగిన విధానం నాకు ఒక ఇన్స్పిరేషన్..  దిల్ రాజు గారు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఈరోజు అమరేషను, ప్రార్థన సందీప్ ని విష్ చేశారు. నాన్న అంటే ఎవరికీ ఇష్టం ఉండదు.. నాకు నాన్న లేరు, అందుకని నాకు అయన విలువ బాగా తెలుసు, అందరు పిల్లలు నాన్న మనకి ఏం ఇచ్చారు అనుకుంటారు, కాని నా సినిమాలో హీరో సత్య మాత్రం నేను నాన్నకి ఏమన్నా ఇవ్వాలి అని, అనుకుంటే ఏమన్నా చెయ్యగలను అని తన జర్నీ ని స్టార్ట్ చేశారు. ఈ సినిమాని చాలా మంది నిర్మాతలు తెలుగులో చేస్తాం అని అడిగారు కాని సతీష్ గారు నేను శివకి మాట ఇచ్చాను అని, నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చారు, ఎన్నో సినిమాలకి రివ్యూస్ రాసిన నేను, కచ్చితంగా మీ ముందుకు మంచి సినిమానే తీసుకొని వస్తాను..

సీనియర్ రిపోర్టర్ ప్రభు గారు మాట్లాడుతూ… శివ జర్నీ ఒక్క సారి చూస్తే. రీల్ కెమెరా వచ్చినప్పటి నుండీ ఇప్పుడు డిజిటల్ ఎరా వరుకు.. ఎప్పుడు కష్టపడుతునే ఉంటాడు.. తన మార్క్ నీ చుపించాడానికి పరిగెడుతునే ఉంటాడు.. హార్డ్ వర్క్ ని నమ్ముకుని రిలేషన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళే  వ్యక్తికి సక్సెస్ కచ్చితంగా వస్తుంది..

పిఆర్ఓ మాడురి మధు మాట్లాడుతూ… ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ నుండి ప్రొడ్యూసర్  అయ్యి. ఈ సినిమాతో హిట్ కొట్టి,శివ మల్లాల  స్ట్రెయిట్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను

Share
Published by
Shankar

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM