Sukumar unconditional love on buchibabu sana
Sukumar Unconditional Love: గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత ఆ శిష్యుడు ప్రయోజకుడైతే ఆ గురువు ఆనందమే వేరు.. వీడు నా శిష్యుడు అంటూ గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సుకుమార్ అదే ఆనందంలో ఉన్నారు. ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న దర్శకుడు బుచ్చిబాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో శిక్షణ పొందాడు. సుకుమార్ తరహాలోనే ఉప్పెన రూపంలో ఓ విభిన్నమైన, సాహసోవంతమైన, అందమైన ప్రేమకథను ఓ ప్రేమకావ్యంలా మలిచాడు. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ.. వసూళ్ల సునామీతో దూసుకుపోతుంది.
బుచ్చిబాబు నాపెద్ద కొడుకు, నేను పుత్రోత్సహాంలో వున్నాను.. అంటూ వేదికపై చెప్పిన దర్శకుడు సుకుమార్ బుచ్చిబాబుకు ప్రేమతో ఓ లేఖను రాశారు. ఇప్పుడా లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద పెద్ద దర్శకుల శిష్యులు కూడా ఇంతకు ముందు దర్శకులయ్యారు. కానీ ఏ దర్శకుడూ ఈ స్థాయిలో తన శిష్యుడిపై ప్రేమ చూపలేదు. ఇంకా చెప్పాలంటే.. తనే ఓ శిష్యుడిగా మారిపోతున్నాడంటూ.. సుకుమార్ ఎక్స్‌ప్రెస్ చేసిన ఎమోషన్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనే చెప్పాలి.
‘‘నువ్వు నన్ను గురువును చేసే సరికి… నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా…?? అని.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సానా బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు – సుకుమార్’’ అంటూ సుకుమార్ రాసిన ఈ లేఖ అందరిని అలరిస్తుంది.
ఓ శిష్యుడి పట్ల గురువు ప్రేమను చూసి అందరూ సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఓ శిష్యుడిని దర్శకుడిగా చూడాలనే తపన, అతని సినిమా కోసం ఓ గురువు ప్రేమ, ఇదంతా సినీ పరిశ్రమలో చాలా అరుదు అంటూ.. వీరి గురుశిష్యుల బంధానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…