‘అనగనగా ఓ రౌడీ’.. సుమంత్ లుక్ అదిరింది | sumanth anaganaga O rowdy
కొన్ని రోజుల క్రితం హీరో సుమంత్ రౌడీ గెటప్‌లో ఉన్న ఓ స్టిల్ పోస్ట్ చేసి.. అనగనగా ఒక రౌడీ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. సుమంత్ గెటప్ రౌడీగా ఉండటంతో.. అంతా రౌడీ అనుకున్నారు కానీ.. ఆయన చేసిన ట్వీటే సినిమా టైటిల్ అని ఎవరూ ఊహించలేదు. వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో సుమంత్ నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రానికి ‘అనగనగా ఒక రౌడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 9 సుమంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన సుమంత్ లుక్‌తో ఓ ప్రచార చిత్రాన్ని మేకర్స్ విడుదల చేశారు.
మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రమని తెలిపారు. సుమంత్ పాత్ర పూర్తి రొటిన్‌కు భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది. వాల్తేరు శ్రీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్నీ అలరించే విధంగా వుంటుంది. వైజాగ్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది అని తెలిపారు.
ఐమా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి
సంగీతం: మార్క్.కె.రాబిన్,
సహ నిర్మాత: విజయ్.కె.బి,
నిర్మాతలు: గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్,
రచన-దర్శకత్వం: మను యజ్ఞ
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…