Videos

‘ఉప్పెన’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ఆల్రెడీ సంగీత ప్రియులను అలరిస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. విలేజ్ బాక్డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టొరీగా హై ఎమోషన్స్ తో రూపొందిన ‘ఉప్పెన’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ లో వస్తోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.

ఫిబ్రవరి 12న గ్రాండ్ రిలీజ్
నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మాట్లాడుతూ.. దర్శకుడు బుచ్చిబాబు కథ చెప్పిన దానికంటే టు హండ్రెడ్ పర్సెంట్ బాగా తీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. మా సంస్థలో పనిచేస్తున్న డైరెక్టర్స్, వెల్ విషర్స్ అందరూ సినిమా చూసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు అని అప్రిషియేట్ చేస్తున్నారు. చిరంజీవి గారు కూడా సినిమా చూసి చాలా గొప్ప సినిమా తీశారు అని ఆయన సంతోషాన్ని అంతా మాతో షేర్ చేసుకున్నారు. వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. వారందరికీ మా మైత్రీ టీం అందరికీ చాలా థాంక్స్. ఇంత మంచి అద్భుతమైన సినిమాని మా బ్యానర్ లో చేసిన సుకుమార్ గారికి, బుచ్చిబాబులకు మా ధన్యవాదాలు. ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ గా ఉప్పెన రిలీజ్ అవుతుంది. ప్రతీ ఒక్కరూ మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము.. అన్నారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM