Cinema

ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా వుంటుంది: దర్శకుడు పరశురాం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది. ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి థియేట్రికల్ ట్రైలర్. బ్రమరాంభ థియేటర్ లో ఫ్యాన్స్ కోలాహలం మధ్య సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు, చిత్ర దర్శకుడు పరశురాం మిగతా టీం సభ్యులు పాల్గొని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కేరింతల మధ్య ట్రైలర్ ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పరశురాం మాట్లాడుతూ.. ట్రైలర్ కి ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా వుంది. ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా. ప్రస్తుతానికి ట్రైలర్ ఎంజాయ్ చేయండి. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కలుద్దాం. సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని నవీన్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ పరశురాం గారు చెప్పినట్లు ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు వుంటుంది. ఇది గ్యారెంటీ. మే 12న అందరూ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి సినిమా సర్కారు వారి పాట అని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. హైవోల్టేజ్ యాక్షన్.. గ్రాండ్ విజువ‌ల్స్‌… మళ్ళీ మళ్ళీ వినాలనిపించే డైలాగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది సర్కారు వారి పాట ట్రైలర్.

‘‘నా ప్రేమ‌ని దొంగిలించ‌గ‌ల‌వు…
నా స్నేహాన్నీ దొంగిలించ‌గ‌ల‌వు..
యూ కాన్ట్ స్టీల్ మై మ‌నీ.. – ఈ డైలాగ్‌తో మ‌హేష్ బాబు క్యారెక్టర్ ని పరిచయం చేయడం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ మూమెంట్ తెచ్చింది.
‘‘అప్పనేది ఆడ‌పిల్ల లాంటిది సార్.. ఇక్కడెవ‌రూ బాధ్యత గ‌ల తండ్రిలా బిహేవ్ చేయ‌డం లేదు’’ అని మహేష్ పాత్ర చెప్పడం
‘నా దృష్టిలో అప్పనేది సెట‌ప్ లాంటిది..’ అని విల‌న్ స‌ముద్రఖ‌ని అనడం.. కథలో హై వోల్టేజ్ కాన్ ఫ్లిక్ట్ తెలియజేస్తుంది.
‘‘ఓ వంద వ‌యగ్రాలు వేసి శోభ‌నం కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కొడుకు గ‌దికి వ‌చ్చిన‌ట్టు వ‌చ్చారు’’.. మ‌హేష్ పలికిన ఈ డైలాగ్ వీర లెవల్ మాస్ గా విజిల్స్ కొట్టించింది.

ట్రైలర్ లో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. అదే సమయంలో మాస్ యాక్షన్ తో అదరగొట్టారు. దర్శకుడు పరశురాం మహేష్ బాబుని సరికొత్తగా చూపించి అభిమానులని అలరించారు. మహేష్ బాబు కీర్తి సురేష్ జోడి లవ్లీగా వుంది.

టెక్నికల్ గా సర్కారు వారి పాట అత్యున్నత స్థాయిలో వుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఎస్ థమన్ ట్రైలర్ కోసం చేసిన బీజీఏం స్కోర్ గ్రాండ్ వుంది. విజువల్స్ లావిష్ గా వున్నాయి. సర్కారు వారి పాట ట్రైలర్ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని ఇంకా పెంచేసింది.

మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సీఈవో: చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ – యుగంధర్
పీఆర్వో : వంశీ- శేఖర్

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM