Cinema

‘ఓదెల 2’లో శివశక్తిగా తమన్నా..

సూపర్‌హిట్ ఓటీటీ చిత్రం ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్ అయిన ఓదెల 2 చిత్రం ఇటీవలే కాశీలో గ్రాండ్ గా ప్రారంభమైయింది. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది క్రియేటర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు హై బడ్జెట్ తోనిర్మిస్తున్నారు.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ చిత్రంలో శివశక్తి పాత్రలో నటిస్తున్న తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర కోసం తమన్నా కంప్లీట్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు.  నాగ సాధువులా వేషం ధరించి, ఒక దండము, మరో చేతిలో డమరుడు, నుదుటిపై పసుపు బొట్టు, దానిపై కుంకుమ బిందువుతో శివశక్తిగా అద్భుతంగా దర్శనమిస్తున్నారు

కాశీ ఘాట్‌లపై నడుస్తూ, ఆమె కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తున్నారు. ఇది అన్ బిలివబుల్ మేక్‌ఓవర్, ఫస్ట్‌లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. నిజంగా శివరాత్రికి ఇది పర్ఫెక్ట్ ట్రీట్. ఓదెల 2 గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలు చాలా అద్భుతంగా వుండబోతున్నాయి. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ముఖ్య తారాగణం. VFX సినిమాలో టాప్ క్లాస్ ఉండబోతుతున్నాయి, ఓదెల 2లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పని చేస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమా నేషనల్ వైడ్ గా విడుదల కానుందని మేకర్స్ తెలియజేశారు.

తారాగణం: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM