Cinema

విష్ణు మంచు ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్

మహాశివరాత్రి పర్వదినాన “కన్నప్ప” ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కన్నప్పగా విష్ణు మంచు అందరినీ ఆకట్టుకునేలా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఇన్ని రోజులుగా కన్పప్ప నుంచి రిలీజ్ చేసిన కంటెంట్‌ ఒకెత్తు అయితే.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ మరో ఎత్తు అన్నట్టుగా సినిమాపై మరింత హైప్ పెరిగింది.
“కన్నప్ప” ఓ దృశ్యం కావ్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను తెరపైకి తీసుకొస్తున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరిలోనూ స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది.  విష్ణు మంచు ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కన్నప్ప కథను సంపూర్ణంగా చెప్పేస్తోంది. ఈ పోస్టర్ పాత్రలోని ధైర్యం, కారెక్టర్లోని డెప్త్, ఇంటెన్సిటీని చూపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసేలా ఉంది. బాక్సాఫీస్‌పై విష్ణు మంచు ఆ విల్లు  ఎక్కుపెట్టినట్టుగా కనిపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కన్నప్పపై భారీ అంచనాలుండగా.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మరింత బజ్ పెరిగింది. కన్నప్పను తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భక్తి పురాణ గాథను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Posts

“ఓ మాట అనుకుందామా” డబ్బింగ్ పూర్తి

శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్ లో సుహాసిని, వినోద్ కుమార్ ప్రధాన జంటగా,శ్రీనివాస్ అనంతనేని , మౌనిక హీరోహీరోయిన్లుగా బీమ్…

November 8, 2026 at 9:56 AM

GOYAZ 30వ స్టోర్ ను ప్రారంభించిన మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ తన 30వ స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో వైభవంగా…

November 8, 2026 at 9:48 AM

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM