Cinema

vakeel saab teaser: దూసుకుపోతోన్న ప‌వ‌ర్‌స్టార్ ‘వ‌కీల్ సాబ్‌’ టీజర్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్ రీ ఎంట్రీలో మొట్టమొదటిగా న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు, ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ కానుకగా చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క డైలాగ్, చిన్న యాక్షన్ కట్‌తో వచ్చిన ఈ టీజర్ ఇప్పుడు 15 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించి ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది.

టీజర్ విషయానికి వస్తే.. లాయర్స్ వేసుకునే కోటుని పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వేసుకోవ‌డంతో మొద‌లైన టీజ‌ర్‌.. ఆయ‌న లా పుస్త‌కాల‌ను మూసి ఉంచిన క‌వ‌ర్‌ను తొల‌గించ‌డం, సీరియ‌స్‌గా కోర్టులో చేతిలో చైన్ వాచ్ తిప్పుతూ.. అబ్జ‌క్ష‌న్ యువ‌రాన‌ర్ అంటూ డైలాగ్ చెప్ప‌డం.. అలాగే త‌నని క‌త్తితో పొడ‌వ‌డానికి వ‌చ్చిన విల‌న్స్‌తో కోర్టులో వాదించ‌డం తెలుసు… కోటు తీసి కొట్ట‌డ‌మూ తెలుసు అంటూ వారిని చిత‌క‌బాద‌డం.. వంటి మాస్ స‌న్నివేశాల‌తో పాటు.. చివ‌ర‌లో త‌న ల‌గేజీతో ట్రావెల్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. బ్యాగ్రౌండ్‌లో స‌త్య‌మేవ జ‌య‌తే.. అనే ప‌దానికి సంబంధించిన మ్యూజిక్ వినిపిస్తుంది.

టీజ‌ర్ ప‌క్కా మాస్‌ను, పవన్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకునేలా ఉంది. త‌మ‌న్ త‌న‌దైన స్టైల్లో సూప‌ర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో టీజ‌ర్‌లోని ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎలివేట్ చేశాడు. పవన్ కల్యాణ్ సినిమాను ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారో అలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు తెర‌కెక్కించాడు. ప్ర‌తి ఫ్రేములోనూ శ్రీరామ్ వేణు.. ప‌వ‌న్‌ను యూత్‌, మాస్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. ఈ టీజ‌ర్‌తో ‘వ‌కీల్ సాబ్‌’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అనిపించేలా సినిమాపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్; ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM