మెట్ల మార్గంలో వెళ్లి.. శ్రీవారిని దర్శించుకున్న 'ఉప్పెన' టీమ్ | Uppena Movie Team
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. హీరో హీరోయిన్ ఇద్దరు కొత్తవారే అయినా నటనలో ఎంతో అనుభవం ఉన్నట్లు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా వైష్ణవ్ తన నటనతో మెగాభిమానుల మనసులను దోచుకున్నాడు. ఇక హీరోయిన్ కృతి కూడా అద్భుతంగా నటించి అందరిని మెప్పించింది. అసలు విషయానికి వస్తే సినిమా సక్సెస్ అయినందుకు టీం అంత కలిసి ఆ ఏడుకొండల స్వామి దర్శనం కోసం కాలినడకన ఏడుకొండలు ఎక్కినట్లు తాజా సమాచారం.
అంతకుముందు చిరంజీవి, పవన్ కల్యాణ్.. రీసెంట్‌గా నితిన్ వంటి వారు కూడా ఇలా మెట్ల మార్గంలో నడిచివెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ‘ఉప్పెన’ సక్స్‌స్ ఉత్సాహంలో ఉన్న టీమ్ అంతా కలిసి సక్సెస్ టూర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ దేవాలయాలకు కూడా ‘ఉప్పెన’ టీమ్ వెళ్లి.. దేవుడి ఆశీర్వదాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ టీమ్ పలు దేవాలయాలను చుట్టి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ రోజు(శనివారం) ఉదయం వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చి బాబు, మరికొంతమందితో కలిసి శ్రీవారి దర్శనార్ధమై తిరుమలకు వెళ్లారు. అదికూడా ఆ ఏడుకొండలు కాలినడకన వెళ్లడం విశేషం. తరచూ ఇలా సినిమా సక్సెస్ కారణంగా చాలా మంది సెలబ్రిటీలు శ్రీవారి దర్శనం చేసుకోవడం అనేది పరిపాటే. కానీ ఎవ్వరూ కాలినడకన వెళ్లడం అనేది జరగదు. కార్లలో వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వస్తూ ఉంటారు. అలా మెట్ల మార్గంలో వెళుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…