Cinema

‘సంక్రాంతికి వస్తున్నాం’లో సంక్రాంతి స్పెషల్ సాంగ్‌ పాడిన విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ ‘గురు’ సినిమాలో తన ఎనర్జిటిక్ వోకల్స్ తో పాడిన జింగిడి జింగిడి సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి సింగర్ గా అలరించబోతున్నారు వెంకటేష్. ఈ సారి, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న తన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ లోని ట్రాక్‌కి తన వాయిస్‌ని అందిస్తున్నారు.
రీసెంట్ గా బిహైండ్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ ఎక్సయిటింగ్ డెవలప్మెంట్ ని రివిల్ చేశారు.
మొదట్లో ఈ సినిమా స్పెషల్ ఫెస్టివల్ ట్రాక్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్‌ని తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు. అయితే వెంకటేష్ తనకు అలవాటైన చార్మ్ తో ఆ పాటను తానే పాడాలనే కోరికను వ్యక్తం చేశారు. వెంకటేష్ ఉత్సాహంగా అవకాశాన్ని కోరడం, అనిల్ రావిపూడి అంగీకరించడం వీడియోలో ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’లోని ఈ వైబ్రెంట్ ఫెస్టివల్ ట్రాక్ ప్రస్తుతం RFCలో చిత్రీకరణజరుగుతోంది. ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు వైరల్ హిట్స్ గా నిలిచి ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి, ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ సాంగ్ కోసం క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ హై ఎనర్జీ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్. వెంకటేష్ ఎక్స్ పోలీసు ఆఫీసర్ గా, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి అతని ఎక్స్ లవర్ గా నటిస్తున్నారు.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్‌ను నిర్వహిస్తుండగా, ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లేను రూపొందించారు. ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలకు వి వెంకట్ కొరియోగ్రఫీ అందించారు.
సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Recent Posts

“ఓ మాట అనుకుందామా” డబ్బింగ్ పూర్తి

శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్ లో సుహాసిని, వినోద్ కుమార్ ప్రధాన జంటగా,శ్రీనివాస్ అనంతనేని , మౌనిక హీరోహీరోయిన్లుగా బీమ్…

November 8, 2026 at 9:56 AM

GOYAZ 30వ స్టోర్ ను ప్రారంభించిన మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ తన 30వ స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో వైభవంగా…

November 8, 2026 at 9:48 AM

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM