‘ఖుషి’.. ఎమోషనల్ లవ్ సాంగ్ విడుదల .. Yedhaki Oka Gaayam Song from Kushi Released
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ . ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి లవ్ పెయిన్ తెలిపే ‘యెదకి ఒక గాయం..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
యెదకి ఒక గాయం.. వదలమంది ప్రాణం.. చెలిమివిడి బంధం.. ఎవరు ఇక సొంతం.. కలతపడి హృదయం… కరగమంది మౌనం… గతమువిడి పాశం.. ఏది ఇక బంధం అంటూ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించగా సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ స్వరపర్చి పాడారు. పాటలోని సాహిత్యం, సంగీతం ఎంతో అందంగా కలిసిపోయిన ఈ పాట వినగానే మ్యూజిక్ లవర్స్ ను ఫేవరేట్ సాంగ్ గా మారిపోవడం ఖాయం. ఈ పాటలో విజయ్ దేవరకొండ పలికించిన భావోద్వేగాలు కూడా ఆడియెన్స్ కు హార్ట్ టచింగ్ గా ఉండబోతున్నాయి. సినిమాలో ఈ పాట వచ్చే సిచ్యువేషన్ కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. యెదకి ఒక గాయం పాటకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పిక్చరైజ్ చేసినట్లు దర్శకుడు శివ నిర్వాణ చెబుతున్నారు.
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…