Featured

అదరగొట్టిన అశ్విన్.. ఒక్క మ్యాచులో ఇన్ని రికార్డులా?

చెన్నై: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యంత అరుదైన మరో ఘనత సాధించాడు. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఇలా ఒక ఇన్నింగ్స్‌లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్ కెరీర్‌లో ఇది 28వ సారి. చెన్నై టెస్టు ప్రదర్శనతో ఇన్నిసార్లు ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో అశ్విన్ చేరిపోయాడు.

ఈ జాబితాలో ఇంగ్లండ్ గ్రేట్ ఇయాన్ బోథమ్‌ను సైతం అశ్విన్ వెనక్కి నెట్టేశాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్ల ఆల్‌టైం జాబితాలో 8వ స్థానాన్ని ఆక్రమించాడు. అలాగే ఈ రికార్డు సృష్టించిన స్పిన్నర్లలో ఐదో వాడిగా, ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. అశ్విన్ కంటే ముందు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈ రికార్డు సాధించిన వారి జాబితాలో ఉన్నాడు. కుంబ్లే తన కెరీర్‌లో 35సార్లు ఈ ఘనత సాధించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ తొలి బంతికే ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ వికెట్‌ను అశ్విన్ పడగొట్టాడు. దీంతో అశ్విన్ పేరిట మరో రికార్డు కూడా చేరింది. 1907వ సంవత్సరం తర్వాత క్రికెట్ చరిత్రలో ఇలా ఓ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీయడం ఇదే తొలిసారి. 114 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి స్పిన్నర్‌గా అశ్విన్.. తన పేరును రికార్డు పుస్తకాల్లో రాసుకున్నాడు. అంతేకాదు, చెన్నై టెస్టులో బంతితో మాయ చేసిన అశ్విన్.. 15 సార్లు ఆరు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్ల జాబితాలో అశ్విన్ ఆరో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ జాబితాలో కూడా భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తొలి స్థానాన్ని ఆక్రమించాడు. దీంతో అశ్విన్ రెండో స్థానానికే పరిమితం అయ్యాడు. కుంబ్లే తన కెరీర్‌లో 19 సార్లు ఆరు వికెట్లు సాధించాడు.

చెన్నైలో పడగొట్టిన వికెట్లతో కలుపుకుని అశ్విన్ ఇప్పటి వరకూ టెస్టుల్లో 386 వికెట్లు కూల్చాడు. 75 టెస్టుల తర్వాత ఓ బౌలర్ సాధించిన రెండో అత్యధిక వికెట్లు ఇవే. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 420 వికెట్లతో అశ్విన్ కంటే ముందు వరుసలో ఉన్నాడు.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM