Cinema

రికార్డులు బద్ధలు కొడుతున్న ‘డీమాంటే కాలనీ 2’

నేషనల్‌, అక్టోబర్‌xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్ తో జీ 5లో హిస్టరీ క్రియేట్‌ చేస్తోంది డీమాంటే కాలనీ 2. దాదాపు దశాబ్దం క్రితం విడుదలైన డీమాంటే కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. హారర్‌ కామెడీ విభాగంలో సరికొత్త ఒరవడికి తెరదీసింది. ఓ వైపు భయపెడుతూనే, నవ్వులు కురిపించి, ఈ జోనర్‌కి ప్రత్యేకమైన ప్రేక్షకులను క్రియేట్‌ చేసింది. అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమాలో అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్‌ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మొదటి భాగం ఎక్కడ ఆగిందో, సరిగ్గా అక్కడి నుంచే రెండో భాగాన్ని స్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం జీ5లో ప్రదర్శితమవుతోంది డీమాంటే కాలనీ2.

సాహసాలను ఇష్టపడే నలుగురు స్నేహితులు – శ్రీనివాసన్‌, విమల్‌, రాఘవన్‌, సాజిత్‌.. థ్రిల్‌ని ఇష్టపడే ఈ నలుగురూ డీమాంటే కాలనీలోని ఓ మేన్షన్‌కి వెళ్తారు. 19వ శతాబ్దంలో ధనికుడైన పోర్చుగీస్‌ బిజినెస్‌మేన్‌ జాన్‌ డీమాంటేకి చెందిన మేన్షన్‌ అది. అయితే అక్కడ పారానార్మల్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి. ఎందరి శాపాలకో గురయి ఉంటుంది.  దాని వల్ల పలు రకాల ఇబ్బందులకు గురయి ఉంటాడు అతను. అలాంటి వ్యక్తికి చెందిన మేన్షన్‌కి వెళ్లిన నలుగురికి ఏమయింది? అక్కడ ఇరుక్కున్న ఆ నలుగురికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వాటి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో తెరకెక్కింది.
డీమాంటే కాలనీ2కి వస్తున్న అద్భుతమైన స్పందనకు ఆనందం వ్యక్తం చేశారు డైరక్టర్‌ అజయ్‌ జ్ఞానముత్తు. ఆయన మాట్లాడుతూ ” జీ5లో డీమాంటే కాలనీ2 వరల్డ్ డిజిటల్‌ ప్రీమియర్‌కి వచ్చిన స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. 100 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్ గురించి వినగానే చాలా ఆనందంగా అనిపించింది. ఈ హారర్‌ కామెడీ జీ 5లో అద్భుతంగా మెప్పిస్తోంది. అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్‌ నటన గురించి తప్పక ప్రస్తావించాలి. ఇలాంటి జానర్‌కి ఇంత మంది అభిమానులుండటం చాలా గొప్ప విషయం. ఇది జస్ట్ బిగినింగ్‌ మాత్రమే. ఇక్కడి నుంచి ఎంతెంత దూరం ప్రయాణిస్తామో మాటల్లో చెప్పలేం” అని అన్నారు.
అరుళ్‌నిధి మాట్లాడుతూ ”అమేజింగ్‌ థియేట్రికల్‌ రన్‌ చూసిన సినిమా డీమాంటే కాలనీ2. ఇప్పుడు వరల్డ్ డిజిటల్‌ ప్రీమియర్‌లో జీ5లో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ దాటడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో మాతో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మా ప్రాజెక్ట్ మెప్పిస్తోంది. ప్రేమతో, అభిమానంతో ఫ్యాన్స్ పంపిస్తున్న సందేశాలు చూస్తుంటే సంబరంగా ఉంది. ఇలాంటి గొప్ప ఆదరణ చూస్తుంటే నమ్మలేని నిజంలాగా ఉంది” అని అన్నారు.
జీ5లో స్ట్రీమింగ్‌ అవుతున్న డీమాంటే కాలనీ2ని మీరు మిస్‌ కాకండి…

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM