నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న ‘కుబేరు’ చిత్రం ఫస్ట్ లుక్ మహా శివరాత్రికి విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ధనుష్ డిఫరెంట్ అవతార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
తాజాగా టీమ్ బ్యాంకాక్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ, యాక్షన్ పార్ట్‌లు చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఇంతకు ముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో నాగర్జున, శేఖర్ కమ్ముల సంభాషిస్తూ కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వండర్ ఫుల్ వ్యూని గమనించవచ్చు.
ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక. భారీ అంచనాలున్న ఈ చిత్రం లావిష్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది.
నేషనల్ అవార్డ్ విన్నర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లు.
తారాగణం: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన, జిమ్ సర్భ్ తదితరులు
అరమరికలొద్దు. అపోహలొద్దు. అనుమానాలొద్దు. అసూయలొద్దు. అహంకారాలొద్దు. బ్రాహ్మణుడు క్షేమంకరమైన భావాలతో సంచరిస్తేనే అపూర్వాలు సమాజానికి అందుతాయంటూ చాలా చక్కగా ప్రముఖ…
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్ పతాకంపై…
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యుజ్…
క్రమపాఠీలు, ఘనపాఠీలు, సలక్షణ ఘనపాఠీలు... ఇలా ఎందరో వేదనిధుల్లాంటి వందకు పైగా వివిధ ఆలయాల, వివిధ వేద పాఠశాలల వేదపండితులు…
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…