పెళ్లికి వెళ్తే ఆధార్ కార్డు చేతికిచ్చారు.. అసలు విషయం ఏంటంటే?, digital india effect wedding food menu in aadhar card
న్యూఢిల్లీ: పెళ్లి అనేది సాధారణంగా జీవితంలో ఒకేసారి వచ్చే పండుగ. అందుకే దీన్ని ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని జంటలన్నీ కోరుకుంటాయి. ఇటీవలి కాలంలో చాలా జంటలు.. తమ పెళ్లిని వినూత్నంగా చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. కొందరు ఆకాశంలో పెళ్లి చేసుకుంటే.. మరికొందరు నడి సముద్రంలో చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ జంట తమ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలని డిసైడ్ అయింది. దీని కోసం తమ బుర్రలకు బాగా పదును పెట్టింది. ఆ తర్వాత ఓ వింత నిర్ణయం తీసుకుంది. తమ పెళ్లిలో అతిథులకు వడ్డించే ఆహార పదార్థాల లిస్టును ఆధార్ కార్డ్ తరహాలో ముద్రించింది. ఇది వింతగా ఉండటంతో వీళ్లు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలు ఎవరీ జంట? అంటే వీళ్లిద్దరూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. కోల్‌కతాలోని రాజర్హాట్ ప్రాంత వాసులైన గొగోల్ సాహా, సుబర్న దాస్ జంట.. ఈ నెల 1న పెళ్లితో ఒక్కటైంది. అయితే వీరి పెళ్లికన్నా కూడా వీరి వెడ్డింగ్ ఫుడ్ మెనూ కార్డ్ బాగా చర్చనీయాంశం అయింది. ఎందుకంటే దీన్ని ఆధార్ కార్డ్ మోడల్‌లో తయారు చేశారు. దీన్ని గమనించిన ఓ అతిథి.. ఇదేదో బాగుందే అని ఆ కార్డును ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి దానిని అందరూ మెచ్చుకుంటున్నారు. దీనిని గమనించిన ఆ దంపతులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమ ఆలోచనకు ఇంత గొప్పగా ప్రచారం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇంతమంది దీన్ని షేర్ చేస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు.
సాహా మాట్లాడుతూ.. తామిద్దరం డిజిటల్ ఇండియాను సమర్థిస్తామని చెప్పారు. ఇలా వెడ్డింగ్ ఫుడ్ మెనూ కార్డును ఆధార్ కార్డులా ప్రింట్ చేయించాలనే ఆలోచన తన భార్య సుబర్నకు వచ్చిందని సాహా వెల్లడించారు. డిజిటల్ ఇండియాకు మద్దతుగా ఏం చేయాలా? అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్డును చూసి చాలా మంది షాకయ్యారని, పెళ్లిళ్లకు వెళ్లాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి చేశారా? అని అడిగారని సాహా దంపతులు నవ్వుతూ చెప్పారు. కొందరైతే డైనింగ్ టేబుల్ మీద ఆధార్ కార్డు వదిలేశావా? అంటూ సరదాగా జోకులు కూడా వేశారని తెలిపారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…