Cinema

FCUK Movie Song: ‘ఎఫ్‌సీయూకే’లోని మ‌న‌సు క‌థ పాట‌ విడుదల

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర పోషించిన ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రంలోని మూడో పాట ‘మ‌న‌సు క‌థ‌’ను అద‌న‌పు డీసీపీ మ‌ద్దిపాటి శ్రీ‌నివాస్ రావు చేతుల మీదుగా చిత్ర బృందం విడుద‌ల చేసింది. రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి యువ‌జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ ప‌తాకంపై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో బేబి స‌హ‌శ్రిత మ‌రో కీల‌క పాత్ర‌ధారి. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పోలీస్ అధికారులు, క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందుతున్న సంక్షోభ కాలంలో త‌మ డిపార్ట్‌మెంట్ సిబ్బంది చేసిన సేవ‌ల‌ను మ‌రోసారి గుర్తుచేసిన చిత్ర బృందానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మునుప‌టి రెండు పాట‌ల‌ను వైద్య‌-ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులు విడుద‌ల చేశారు. అవి సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ.. పోలీసువారంటే త‌న‌కు చాలా గౌర‌వ‌మ‌నీ, క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న కాలంలో వారు అందించిన అవిశ్రాంత సేవ‌లు చూశాక‌, ఆ గౌర‌వ‌భావం రెట్టింప‌య్యింద‌నీ అన్నారు. సాధార‌ణంగా పోలీస్ అధికారులంటే నిర్విరామంగా ఏడాది పొడ‌వునా ప్ర‌తి రోజూ 24 గంట‌ల సేపు సీరియ‌స్‌గా త‌మ విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటార‌ని మ‌న‌కు తెలుసు. కానీ వారిలోనూ స‌ర‌దా కోణం ఉంటుంద‌నే విష‌యం అద‌న‌పు డీసీపీ మ‌ద్దిపాటి శ్రీ‌నివాస్ రావుగారు ‘మ‌న‌సు క‌థ’ పాట‌ను లాంచ్ చేసి, దానిని ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్ త‌ర‌హాలో రాగ‌యుక్తంగా పాడ‌టంతో మ‌రోసారి తెలిసింది. ఆయ‌న త‌న రంగానికి సంబంధించిన అనుభ‌వాల‌ను గుర్తుచేసుకొని, ‘మ‌న‌సు క‌థ’ పాట‌తో తాను ఎలా క‌నెక్ట్ అయ్యారో వివ‌రించారు.

బిజీ షెడ్యూల్‌లోనూ త‌మ స‌మ‌యాన్ని కేటాయించి, ఈ పాట విడుద‌ల చేయ‌డానికి వ‌చ్చిన పోలీస్ అధికారుల‌కు హీరో రామ్ కార్తీక్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. నిజ జీవిత హీరోల‌కు త‌మ వంతు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయ‌డానికి శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ ఈ కార్య‌క్రమానికి శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు, సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో, లైన్ ప్రొడ్యూస‌ర్ వాసు ప‌రిమి పాల్గొన్నారు. రీల్ హీరోల స్థానంలో రియ‌ల్ హీరోల‌తో ‘ఎఫ్‌సీయూకే’ పాట‌ల‌ను విడుద‌ల చేయించాల‌నే నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ సంక‌ల్పానికి అన్ని వైపుల నుంచీ అనూహ్య‌మైన స్పంద‌న‌, ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సాంకేతిక బృందం:
మాటలు: ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

Recent Posts

పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

April 14, 2025 at 8:10 PM

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM