f3 movie release date fixed, ఎఫ్3 మూవీ విడుదల తేదీ ఫిక్సయింది
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ టాక్‌తో 2019 సంక్రాంతి విన్నర్‌గా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. వరుస విజయాలతో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా పేరు పొందిన అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్3’ రూపొందుతోన్న విషయం తెలిసిందే. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫన్ రైడర్‌కు రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. ఆగస్ట్ 27న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వదలబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా.. ‘‘మా బ్యానర్‌లో 2019 సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్2’ చిత్రం ప్రేక్షకులను నవ్వుల జల్లులో ముంచెత్తి ఎంత పెద్ద హిట్ సాధించిందో మీ అందరికీ తెలిసిందే. ‘ఎఫ్2’ ప్రేక్షకులను ఎలా నవ్వించిందో.. దానికి మోర్ ఫన్ యాడ్ చేసి ‘ఎఫ్3’ కథను సిద్ధం చేశాడు డైరెక్టర్ అనిల్. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్‌ల కాంబినేషన్‌లో మరోసారి ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేయడానికి ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మా బ్యానర్‌లో మరో నవ్వుల రైడ్ కన్‌ఫర్మ్’’ అన్నారు చిత్ర నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్.
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఎఫ్2కు ఫ్రాంచైజీగా మోర్ ఫన్‌తో ఎఫ్3 చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విక్టరీ వెంకటేశ్‌గారు, మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌గారు.. నిర్మాతలు రాజుగారు, శిరీష్ గారు సపోర్ట్‌తో చకచకా సినిమాను పూర్తి చేస్తున్నాం. ఆగస్ట్ 27న మరోసారి నవ్వుల్లో ముంచెత్తడానికి మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు:
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: అనీల్ రావిపూడి
సమర్పణ: దిల్‌రాజు
నిర్మాత: శిరీష్
సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్
ఎడిటింగ్: తమ్మిరాజు
రచనా సహకారం: ఎస్.కృష్ణ
ఆడిషన్ స్క్రీన్‌ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…