Featured

రైలు నిమిషం లేట్ అయితే వచ్చే నష్టం ఎంతో తెలుసా?

సామాన్యులు ఎవరైనా దూరప్రయాణం చేయాలంటే ట్రైన్స్ మీదే ఆధారపడతారు. ఈ విషయం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనం కూడా చాలా సార్లు రైలు ఎక్కి ఉంటాం. సినిమాల్లో కూడా ట్రైన్ సీన్లకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడీ ట్రైన్ జర్నీ గోల ఎందుకు అని అనుమానంగా ఉందా? రైళ్ల గురించి మీకు ఓ ఆసక్తికర విషయం చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం అంతా. మనందరం కూడా చాలా సార్లు రైలు ప్రయాణాలు చేసి ఉంటాం. అల్ రైల్లో వెళ్లేటప్పుడు మనం ఎక్కిన ట్రైన్ మధ్యలో ఆగిన అనుభవఘూ అందరికీ ఎప్పుడో ఒకసారి కలిగే ఉంటుంది. స్టేషన్లో ఆగాల్సిన రైలు ఇలా ఆగడంతో రైల్వేలను, డ్రైవర్ ను తిట్టుకున్న సందర్భాలూ ఉంటాయి. అయితే ఇలా జరగడానికి ఏదో ఒక కారణం కచ్చితంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా కారణం లేకుండా ట్రైన్ ఆగదు. కదిలే ట్రైన్ ఎలాంటి కారణం లేకుండా ఆగితే.. ఇండియన్ రైల్వేస్‌కు నష్టం చాలా భారీగా ఉంటుంది. సమాచార హక్కు చట్టం ఉపయోగించి అడిగిన ఈ ప్రశ్నకు రైల్వే శాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం.. డీజిల్ ఇంజిన్‌తో నడిచే ట్రైన్ ఒక్క నిమిషం ఆగిపోతే రైల్వే వ్యవస్థకు రూ.20,401 నష్టం వస్తుంది. అదే ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.20,459 నష్టం. అలాగే గూడ్స్ ట్రైన్ విషయానికి వస్తే.. డీజిల్ ట్రైన్ ఒక నిమిషం ఆగితే రూ.13,334, ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.13,392 నష్టం వస్తుంది.

ట్రైన్ ఒకసారి ఆగితే.. అది మళ్లీ స్పీడ్ పుంజుకోవడానికి కనీసం 3 నిమిషాల టైమ్ పడుతుంది. ఈ టైమ్‌లో డీజిల్ లేదా ఎలక్ట్రిసిటీ బాగా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఒక్క ట్రైన్ ఆగితే.. దాని వెనుక వచ్చే అన్ని రైళ్లనూ ఆపాల్సి వస్తుంది. దీని వల్ల ఎంత నష్టం వస్తుందో మీరే లెక్కేసుకోండి. అంతేకాదు ట్రాక్ లైన్స్‌ను కూడా మళ్లీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని ట్రైన్స్ ఆలస్యం అయితే ప్రయాణికులకు మళ్లీ డబ్బులు రిఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్క ట్రైన్ అకారణంగా ఒక్క నిమిషం ఆగితే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM