Featured

అమృతేశ్వరునిపై శ్రీనివాసుని ‘సహస్ర’ అమృతధారల్ని వర్షించిన కొర్రపాటి

బళ్లారి, జూన్ 24: శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం నుండీ భక్తకోటి ఉపాసించుకుని తరించేందుకు శ్రీ అమృతేశ్వర దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు సాయి కొర్రపాటి, శ్రీమతి రజనీ కొర్రపాటి దంపతులు సహస్ర పేరిట సుమారు రెండువందల యాభైపేజీల చక్కని పవిత్ర తెలుగు భక్తి గ్రంధాన్ని ఉచితంగా పంచడం పలువురు రాజకీయ సామాజిక భక్త ప్రముఖుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప వ్యాఖ్యానాలతో, ఋషుల స్తోత్ర విద్యలతో సహస్ర పేరిట ధార్మిక జీవన ప్రార్ధనా గ్రంధంగా సాయి కొర్రపాటి సమర్పణలో అందిన ఈ గ్రంధం ప్రస్తుతం బళ్లారిలో వందలకొలది గృహాలలో పారాయణాగ్రంధంగా మారినట్లు భక్తకోటి శ్రీ అమృతేశ్వరదేవస్థానంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
శ్రీ అమృతేశ్వరుని స్వరూపంగా స్పటిక మహాలింగంతో గత సంవత్సరం ప్రతిష్ఠితమైన ఈ అద్భుతమైన ఆలయ వైభవ రూప దర్శనానికి విచ్చేసే భక్తులు అభిషేకం అనంతరం గత కొంత కాలంగా ఈ విశేష శక్తుల సహస్ర గ్రంధాన్ని మహా ప్రసాదంగా తీసుకెళ్తున్నట్లు మన కనులముందు కనిపించే సత్యం.

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం వర్షించే అమృత రసధారల్లాంటి అమోఘ గ్రంధాలకు బెంగళూరు, బళ్లారి వంటి ప్రాంతాలలో తెలుగు వారు ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారు.

దర్శకధీరుడు, ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఎస్ ఎస్ రాజమౌళి, కేజీఎఫ్ హీరో యశ్, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎమ్ ఎమ్ కీరవాణి, ప్రముఖ జానపదగాయని మంగ్లీ, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వంటి ప్రముఖులెందరో శ్రీ అమృతేశ్వరస్వామి ఆలయ ప్రారంభ వేడుకలో పాల్గొన్న అంశం ఇప్పటికీ బళ్లారి ప్రజలు చెప్పుకుంటూంటారు.

వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి శివ భక్తుడు కావడం వల్ల బళ్లారికి ఈ అద్భుతం లభించిందని బళ్లారి కమ్మసంఘం ప్రముఖులు సైతం వేనోళ్ళ ప్రశంసలు వర్షిస్తున్నారు.

చాలా ఆలయాల్లో దైవ గ్రంధాలు అమ్ముతున్న ఈరోజుల్లో భక్త కోటికి ఇంత మంచి సహస్ర గ్రంధాన్ని శ్రీ అమృతేస్వరుని కటాక్షంగా ఉచితంగా ఇవ్వడాన్ని అభినందిస్తున్నారు.

వేద పండితులు, అర్చకులు మాత్రమే కాకుండా భక్తులు సైతం హాయిగా చదువుకునే అనేక స్తోత్రాలు, అందమైన వ్యాఖ్యానాలు ఈ బుక్ నిండా ఉండటం వల్ల బళ్ళారి తెలుగు భక్తుల్ని ఈ సహస్ర గ్రంధం విశేషంగా ఆకట్టుకోవడం గమనార్హం.

గతంలో సాయికొర్రపాటి సమర్పణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దేశంలో తొలిసారిగా ఐదువందల ఆంజనేయస్వామి అరుదైన చిత్రాలతో, యంత్ర మంత్ర తంత్రాత్మకంగా అద్భుత రచనా సంకలనంగా పరమ శోభాయమానంగా రూపుదిద్దిన అఖండ భారీగ్రంధం నేనున్నానుని రెండేళ్లనాడు భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి.. ప్రచురణకర్త సాయి కొర్రపాటిని, గ్రంథ రచయిత పురాణపండ శ్రీనివాస్ లపై అభినందనలు వర్షించిన విషయం పాఠకులకు ఎరుకే!

ప్రమాణాలు పాటించడంలో రాజీపడని మనస్తత్వంతో అద్భుత గ్రంధాలు రచించి వేల వేల అభిమానుల్ని సంపాదించుకున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, సాయి కొర్రపాటికి అత్యంత ఆప్తుడని కొర్రపాటి సాయి సన్నిహితులు చెబుతున్నారు. సినీరంగంలో కొర్రపాటి సాయికి రాజమౌళి చాలా ఆంతరంగిక ఆత్మ బంధువని కన్నడ తెలుగు రంగాలకు తెలుసున్న విషయమే. ఈ క్రమంలో కొర్రపాటి పవిత్ర కార్యక్రమాలకు ఆప్తుడు పురాణపండ శ్రీనివాసేనని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM