Featured

సోషల్ మీడియాలో లేడీ బైకర్.. నిజానికి 50 ఏళ్ల అంకుల్!

టోక్యో: సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఓ మహిళా బైకర్ గురించి షాకింగ్ నిజం బయటపడింది. జపాన్‌కు చెందిన ఈ యువ మోటార్ బైక్ రైడర్ అసలు అమ్మాయే కాదట. ఆమె 50 ఏళ్ల మగాడట! బైక్ ముందు నిల్చుని ఇటీవల ‘ఆమె’ తీసుకున్న ఫొటో కొంతమంది అభిమానులకు అనుమానం తెప్పించింది. అంతే వాళ్లు దాన్ని బాగా సీరియస్‌గా తీసుకొని రకరకాల పరీక్షలు చేశారు. దీంతో ఆమె ‘ఆమె’ కాదని, ‘అతను’ అని తేలింది.

బైక్ రియర్ వ్యూ మిర్రర్‌లో కనిపించిన ఆమె ప్రతిబింబం ‘అతడిని’ పట్టించింది. ఈ ఫొటో కాస్తా వైరల్ అవడంతో జపాన్ మీడియా అవుట్‌లెట్లు అన్నీ కదిలాయి. ఆ బైకర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాయి. ఒక జపాన్ వెరైటీ షో సిబ్బంది నానా కష్టాలూ పడి ఈ బైకర్‌ను పట్టుకున్నారు. ఆమె నిజానికి 50 ఏళ్ల పురుషుడన్న విషయం వెల్లడి కావడంతో సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లకు దిమ్మతిరిగిపోయింది.

విషయం బయటపడడంతో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అతగాడు వివరించాడు. సోషల్ మీడియాలో ‘అంకుల్’గా ఉండాలని ఎవరూ అనుకోరని, అందుకే తన ఫొటోను ఇలా అమ్మాయిగా మార్చేశానని తెలిపాడు. సరదా కోసమే అలా చేశాను తప్పితే ఇందులో మరో ఉద్దేశం ఏదీ లేదని వివరణ ఇచ్చుకున్నాడు.

తాను మహిళగా ఫొటో పెట్టిన వెంటనే 1000 మంది ఫాలోవర్లు వచ్చారని, దీంతో దానిని అలాగే కొనసాగించాలని అనుకున్నానని, ఆన్‌లైన్ సెలబ్రిటీగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. తాను అమ్మాయిలా కనపడేందుకు ఫేస్‌యాప్‌, ఫొటోషాప్‌లను ఉపయోగించినట్లు ఈ బైకర్ వివరించాడు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM