Featured

యూనివర్సిటీలో అబ్బాయ్‌కి అమ్మాయ్ లవ్ ప్రపోజ్ .. తర్వాత ఏమైందంటే?

ప్రేమ… ఈ పదం ఎంతో అపురూపమైనది. అది భార్య భర్తల మధ్య కావచ్చు, తల్లి దండ్రులు, పిల్లల మధ్య కావచ్చు… లేదంటే ఒక అమ్మాయి, అబ్బాయి టీనేజ్ లో వారి మధ్య ఏర్పడే ప్రేమ కావచ్చు. ఏదైనా సరే ప్రేమ అమూల్యమైనది. ఇప్పటి వరకు మనం ఒక అబ్బాయి, అమ్మాయికి తన ప్రేమని వ్యక్త పరచటం మాత్రమే చూశాం. కానీ ఇక్కడ మాత్రం అది రివర్స్ అయ్యిందనే చెప్పాలి. అమ్మాయే, అబ్బాయి ముందు చేతిలో గులాబీల బొకేతో ఒంటి కాలిపై కూర్చొని మరీ లవ్ ప్రపోజ్ చేయడం, అందుకు ఆ అబ్బాయి ఓకే చెప్పడం జరిగింది. అంతేకాక వారిద్దరూ యూనివర్సిటీ ఆవరణలోనే ఒకరి నొకరు కౌగిలించుకున్నారు. ఈ సంఘటన లాహోర్ లోని ఒక యూనివర్సిటీలో జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.

సదరు అమ్మాయి, అబ్బాయి చదువుతున్న యూనివర్సిటీ ఆవరణలోనే వారిద్దరూ ఇలా ప్రపోజ్ చేసుకోవడమనేది ఆ యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘించి.. ఇలాంటి దుష్ప్రవర్తన పని చేసినందుకు గానూ ఆ యూనివర్సిటీ యాజమాన్యం మండి పడింది. అంతేకాదు వారికి యూనివర్సిటీని క్రమశిక్షణ సంఘం నోటీసులు కూడా పంపింది. అయితే యూనివర్సిటీని క్రమశిక్షణ సంఘం నుండి వారికి నోటిస్ వచ్చినా కూడా.. వారు లైట్ తీసుకుని హాజరు కాలేదు. దీంతో యూనివర్సిటీ వారు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇకపై వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదివే అవకాశం లేకుండా చేశారు.

మార్చి 12 న ఆ ప్రేమికులిద్దరూ.. క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాల్సి ఉండగా, వారు హాజరు కాలేదు. దీనితో సెక్షన్ 16 క్రింద వారిని డిబార్ చేసినట్లుగా ప్రకటించారు. యూనివర్సిటీ ఆఫ్ లాహోర్ లో కానీ, దానికి సంబంధించిన సబ్ క్యాంపస్‌లలో కానీ వారు చదివేందుకు అవకాశం లేకుండా చేశారు. ఈ ప్రేమికులపై యూనివర్సిటీ తీసుకున్న సంచలన నిర్ణయం క్షణాల్లోనే నెట్ మాయాజాలంలో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలోని నెటిజన్లు ఆ యూనివర్సిటీని తిట్టి పోస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM