Cinema

GA2 పిక్చర్స్ రూపొందుతోన్న ‘ఆయ్’ తొలి పాట విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఆయ్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా టైటిల్ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది.. అలాగే ఫస్ట్ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్స్‌లో మరింత వేగాన్ని పెంచుతూ ఈ చిత్రం నుంచి అంద‌రినీ ఆక‌ట్టుకునేలా మెలోడి ఆఫ్ ది సీజ‌న్ అనిపించేలా ‘సూఫియానా..’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.
ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ పాట‌ల‌కు కేరాఫ్‌గా మారిన రామ్ మిర్యాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌టం విశేషం. ‘సూఫియానా..’ సాంగ్‌ను రామ్ మిర్యాల‌, స‌మీర భ‌ర‌ద్వాజ్‌, ర‌మ్య‌శ్రీ పాడారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత శ్రీమ‌ణి ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. చ‌క్క‌గా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఈ లిరికల్ సాంగ్ ఆక‌ట్టుకుంటోంది.

అంద‌మైన లొకేష‌న్స్‌, బ్యాగ్రౌండ్‌తో అల‌రించే గోదావ‌రి అందాలు, నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక మ‌ధ్య క‌నిపిస్తోన్న కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పింప చేస్తుంది. సింపుల్ కొరియోగ్ర‌ఫీలో ‘సూఫియానా..’ మెలోడి సాంగ్ అంద‌రి హృద‌యాల‌ను ఆక‌ట్టుకుంటుంది. నితిన్‌, న‌య‌న్ సారిక జోడి సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ చ‌క్క‌గా ఉంది. ఈ సాంగ్ అంద‌రి ప్లే లిస్టులో మొద‌టిస్థానంలో ఉంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.

‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను నింపుతోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.

GA2 పిక్చర్స్:

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు:  నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM