ఉల్లికాడలు వాడితే ఏమవుతుందో తెలుసా? | spring onion benefits
Spring Onion Benefits: ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అని తరచు మన పెద్దవారు అంటుంటే వింటుండేవాళ్ళం. అలా ఎందుకంటారంటే ఉల్లిపాయలో అంత మంచి ప్రయోజనాలున్నాయి కనుక. అలాగే ఉల్లికాడలు చేసే మేలు కూడా ఎంతో గొప్పది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ రోజు మనం ఉల్లికాడలు వలన ప్రయోజనాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
-ఉల్లికాడల్లో ఉండే కెమోఫెరాల్ అనే ఒక ఫ్లెవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి తగ్గిస్తుంది. దాని వలన రక్తం సాఫీగా సరఫరా అవుతుంది.
-ఉల్లికాడల్ని తరచూ వాడడం వలన అధిక రక్తపోటుని తగ్గించుకోవచ్చు.
-ఇవి గుండెజబ్బులు రాకుండా చేస్తాయి.
-వీటిలో ఉండే పీచు పదార్ధం వలన అధిక బరువు పెరగకుండా చేసుకోవచ్చు.
-వీటిని వాడడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది.
-గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలల్లో వీటిని తరచూ తీసుకోవడం వలన కడుపులో ఉన్న బిడ్డకి ఫోలిక్ యాసిడ్ అందుతుంది. పుట్టబోయే బేబీకి వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి.
-చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే లక్షణం ఇందులో ఉంది.
-డయాబెటిస్ ఉన్నవారు తరచూ తీసుకుంటే మంచిది.
-ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాల వలన జలుబు, జ్వరం త్వరగా తగ్గుతాయి.
-డైజేషన్ సమస్యని తగ్గిస్తుంది.
-వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
-కీళ్లనొప్పులు కానీ, ఉబ్బసం ఉన్నవారు అయినా దీనిని విరివిగా వాడడం వలన అవి దూరమవుతాయి.
క్లుప్తంగా చెప్పాలంటే ఉల్లికాడల్లో ఉండే విటమిన్ A, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, కాల్షియం లాంటి గుణాల వలన మల్టీపర్పస్ ఔషధంలాగా దీనిని వాడుకోవచ్చు. తరచూ దీనిని వాడుకోవడాన్ని అలవాటుగా చేసుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…