శ్రీ విష్ణు 'శ్వాగ్'లో రీతూ వర్మ Heroine Ritu Varma in Sree Vishnu Swag Movie
శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు హసిత్ గోలీతో చేస్తున్న కొత్త సినిమాకి ‘శ్వాగ్’ అనే టైటిల్ హిలేరియస్ వీడియో ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు . టైటిల్, కాన్సెప్ట్ వీడియో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు, హసిత్ గోలి రీయూనియన్ గా వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న రీతూ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా శ్వాగ్ మేకర్స్ ఆమె పాత్రను వింజమర వంశంలోని మహారాణి రుక్మిణి దేవిగా పరిచయం చేశారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో రీతూ వర్మ శ్రీవిష్ణు వ్యాఖ్యలను పరిహాసం చేస్తూ కనిపించారు. మగవారి కంటే స్త్రీలు గొప్పవారు, శక్తివంతులు అని చెప్పారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీవిష్ణు, ‘శ్వాగ్’ అనేది మగవారి కథ, శ్వాగనికి వంశం కథ అని స్పష్టం చేశారు.
వీడియో హిలేరియస్ గా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న శ్వాగ్- శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి మరొక యూనిక్ మూవీ.
ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ కెమెరా డీవోపీ పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకురుస్తున్నారు. విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని చూస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.
తారాగణం: శ్రీవిష్ణు, రీతూ వర్మ
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…